పశ్చిమగోదావరి

చీఫ్ విప్ పదవి నుండి చింతమనేనిని తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 20: ప్రభుత్వ చీఫ్ విప్ పదవి నుండి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు గురువారం పట్టణంలో కదం తొక్కాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి గంగానమ్మ గుడి సెంటర్, బోసుబొమ్మ సెంటర్, ఆర్టీసీ సెంటర్ల మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు వందలాది మంది కార్మికులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. తరువాత ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏలూరు ఇఫ్టూ అనుబంధ ఐఎంఎల్ హమాలీ ముఠామేస్ర్తీ రాచేటి జాన్‌రాజుపై దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడిచేసి కులం పేరుతో దూషించినందుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఆర్డీవో కె.మోహన్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు పోరండ్ల శ్రీనివాస్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, బీఎస్పీ నాయకుడు కె.శివాజీ, ఎంసీపీఐ (యు) జిల్లా కార్యదర్శి పి.అప్పలరాజు, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వెట్టి సుబ్బన్న, ఎమ్మార్పీఎస్ నాయకుడు విస్సంపల్లి సిద్ధుమాదిగ మాట్లాడుతూ ప్రభుత్వ విప్‌గా ఉన్న చింతమనేని ప్రభాకర్ గతంలో పోలీసు అధికారుల పైన, మహిళా తహసీల్దార్ వనజాక్షి పైన, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశ వర్కర్లపై కూడా అసభ్యపదజాలంతో దూషించారని విమర్శించారు. తన ఇంటిని ఒక రౌడీ కేంద్రంగా చేస్తూ క్రిమినల్‌గా వ్యవహరిస్తున్నా ఇప్పటివరకు 25కు పైగా కేసులున్నా ప్రభుత్వ విప్‌గా తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగించడం ఆ పార్టీ, ప్రభుత్వ విధానాలకు అద్దం పడుతోందన్నారు. ఐఎంఎల్ డిపో మేస్ర్తి దళితుడైన జాన్‌రాజును కొట్టి కులం పేరుతో దూషించినా, బాధితుడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా అధికార పార్టీ నాయకుడు కావడంతో ప్రభుత్వం కేసు నుండి తప్పించాలని చూడటం దుర్మార్గమైన చర్యని విమర్శించారు. ఇప్పటికైనా చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు వెట్టి భారతి, పి.లత, కె.అరుణ, డి.లక్ష్మి, పి.ప్రభుదాసు, బర్రే వెంకటేశ్వరరావు, కె.పోతురెడ్డి, ఎస్.ప్రసాద్, ఇ.్భషణం, కె.కిరణ్‌కుమార్, న్యాయవాది యు.ఏసుబాబు, వి.సద్గురు తదితరులు పాల్గొన్నారు.

పాలకొల్లును అభివృద్ధిలో నెంబరు-1గా నిలుపుతా
ఎమ్మెల్యే నిమ్మల
యలమంచిలి, సెప్టెంబర్ 20: పాలకొల్లు నియోజకవర్గాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో అభివృద్ధిలో నెంబరు-1గా నిలబెడతానని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. యలమంచిలి మండలం కొతేరు గ్రామంలో నిర్మించనున్న కాజ - కొంతేరు - పాలకొల్లు ఆర్‌అండ్‌బి రోడ్డుకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో రూ.110 కోట్లతో ఆర్‌అండ్‌బి రోడ్లను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం రూ.50 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉందని, రెండు మూడు నెలల్లో ఆ పనులను కూడా పూర్తి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాజ - కొంతేరు ఆర్‌అండ్‌బి రోడ్డు పూర్తిగా పాడవడంతో ఆ రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ రోడ్డు తూర్పు గోదావరి జిల్లా వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో నిధుల సమస్య తీవ్రంగా ఉన్నా ఏనాడూ పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో వెనుకాడలేదని ఎమ్మెల్యే చెప్పారు. తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆర్‌అండ్‌బి రోడ్డు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే నిమ్మల ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ బొప్పన సుజాత, జడ్పీటీసీ బోణం నాని, కొంతేరు ఎంపీటీసీ తానింకి వెంకట కృష్ణారావు, టీడీపీ అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు, ఎఎంసీ వైస్-్ఛర్మన్ చిట్టూరి సీతారామాంజనేయులు, బొప్పన హరికిషోర్, మాజీ సర్పంచ్ ముదునూరి నరసింహరాజు, మంచెం చక్రధరరావు, ఆరిమిల్లి రామ శ్రీనివాసరావు, మాతా రత్నరాజు, బాడవ, కొంతేరు మాజీ సర్పంచ్‌లు రాయి రాధ, నిమ్మకాయల హిమబిందు, మామిడిశెట్టి పెద్దిరాజు, కోడి విజయభాస్కర్, మీసాల కృష్ణ, తమ్మినీడి నరసింహారావు, పాముల సజనీకుమారి, కడలి గోపాలరావు, పాముల రజని, కడలి గోపాలరావు, దొడ్డ శ్రీనివాసరావు, పన్నాస శ్రీనివాసరావు, కొప్పినీడి సర్వేశ్వరరావు, ఆర్‌అండ్‌బి అధికారులు పాల్గొన్నారు.