వరంగల్

ఓటమి భయంతోనే ముందస్తుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బచ్చన్నపేట, సెప్టెంబర్ 21: సమాయనికి ఎన్నికలు జరుగుతే ఓటమి తప్పదన్న భయంతోనే కెసిఆర్ ముందుస్తు బాట పట్టాడానిని పిసిసి మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం రాత్రి ఆలింపూర్ గ్రామంలోని మాజీ సర్పంచ్ గూడ రవిందర్‌రెడ్డి ఇంటిలో కార్యకర్తలతో సమావేశమై పార్టీ పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక శక్తుల అరాచకాలకు పులిస్టాప్ పెట్టే సమయం ఆసన్నమైనదని, ఇందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు అన్ని కాంగ్రెస్ హయాంలో నిర్మించివేనన్నారు. వాటిని అడ్డం పెట్టుకిని తెరస ప్రజలను మోసం చేస్తుందన్నారు. అవకాశం ఉన్న చోట నూతన ఓటర్లును సాధ్యమైనంత ఎక్కువగా అర్హులైన వారిని నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు. నకిలీ ఓట్ల నమోదు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ కార్యాకర్తలకు చెందిన 70లక్షల ఓట్లు గళ్లంతు చేశారని ఆరోపించారు. 2018జనవరి 1వ తేదీనాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన వారు నమోదు చేసుకోవాలనడంవల్ల అర్హులైన 20లక్షల మంది ఓటరుగా నమోదు చేసుకోలేకపోతున్నారని అన్నారు. ఓటమి భయంతో తొమ్మిదినెలల ముందుస్తుకు వెళ్ళిన తెరస గెలవడానికి నానా జిమ్మిక్కులు చేస్తుందని అన్నారు. ఇంటింటికి నీళ్లు ఇస్తామని మిషన్‌భగీరథ పైపులైన్లు ఇంకా సగం గ్రామాల్లోకూడ వేయలేకపోయారని విమర్శించారు. రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్రాన్ని దోచుకున్న తిన్నవారిని జైలుకు పంపండం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిడిగొండ శ్రీనువాసు, గ్రామశాఖ అధ్యక్షులు దేవి ఎల్లారెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యులు సత్యనారాయణ, నాయకులు మళ్లవరం అరవింద్‌రెడ్డి, మొలుగూరి రాజయ్య, మహ్మద్ గౌస్, దండ్యాల కరుణాకర్‌రెడ్డి, దాసారం కిష్టయ్య, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.