వరంగల్

పరీక్షల్లో అవతవకలకు పాల్పడితే క్రీమినల్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 21: స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుల్(సివిల్) ప్రిలిమనరి రాత పరీక్ష సమయంలో అభ్యర్థులు ఎలాంటి అవతవకలకు పాల్పడిన క్రీమినల్ కేసులు నమోదు చేస్తామని వరంగల్ పోలీసు కమీషనర్ డాక్టర్ విశ్వనాధ రవీందర్ హెచ్చరించారు. స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుల్ ఉద్యోగ నియామాకాలలో భాగంగా ఈ నెల 30వ తేదీన జరిగే ప్రిలిమనరి రాత పరీక్ష నిర్వహణకోసం చీఫ్ సూపరిండెంట్లు, పరిశీలకులు, ఇన్విజిలేటర్లు, పోలీసు నోడల్ అధికారులతో శుక్రవారం కెయూలోని కామర్స్ కాన్ఫరెన్స్‌హాల్‌లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హజరైన సిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామాక మండలి, జేఎన్‌టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో 30వ తేదీన 95పరీక్షా కేంద్రాలలో 50.410మంది అభ్యర్థులు హజరవుతారని తెలిపారు. వరంగల్ ట్రైసిటి పరిధిలో 51పరీక్షా కేంద్రాల్లో 30.090, జనగామలో 19పరీక్షా కేంద్రాల్లో 9.720, నర్సంపేట 25పరీక్షా కేంద్రాల్లో 13.600మంది అభ్యర్థులు హజరవుతారని అన్నారు. ఉదయం 10గంటలనుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే రాత పరీక్షను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ నోడల్ అధికారిగా క్రైం అదనపు డిసిపి అశోక్‌కుమార్‌ను నియమించామని తెలిపారు. పూర్తిగా పారదర్శకంగా నిర్వహించే రాత పరీక్ష సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా అపోహలకు తావులేకుండా అధికారులకు అప్పగించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని, అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించమని తెలిపారు. క్రైం అదనపు డిసిపి, జేఎన్‌టీయూ ప్రొఫెసర్ గిరిధర్, వరంగల్ రీజీనల్ కో-ఆర్డినేటర్(కెయూ ఇంజనీరింగ్ విభాగం డీన్) ప్రొఫెసర్ టి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని అన్నారు. అధికారులు బయోమెట్రిక్ వినియోగం, ఫొటో ఐడెంటిఫికేషన్ గుర్తించడం తదితర అంశాల విషయంలో నిబంధనలు పాటించాలని కోరారు. అభ్యర్థులు పరీక్షా సమయంలో పాటించవలిసిన నియమ నిబంధనలు తూచా తప్పకుండా అనుసరించాలని అన్నారు.
అభ్యర్థులు చేయకూడనివి: పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు చేతులకు గోరింటాకు వేసుకోకూడదని, అభరణాలు అధికంగా ధరించవద్దని, చేతి గడియారం పెట్టుకోరాదని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకు రావద్దని కోరారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటోలు పరీక్ష గదిలో తీయడం జరుగుతుందని, ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడానికి ప్రయత్నిస్తే సులువుగా పట్టుబడుతారని సిపి అన్నారు.
అభ్యర్థులు పాటించవలిసినవి: అభ్యర్థులు పరీక్షకు ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని, హాల్‌టికెట్ నెంబర్ అదే సెంటర్‌కు సంబంధించిందో లేదో చూసుకోవాలని సిపి సూచించారు. ఉదయం 9గంటలలోపే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని, అభ్యర్థులు నిర్ధేశించిన సమయానికి రెండు గంటల ముందుగానే చేరుకోవాలని కోరారు. హల్‌టిక్కెట్, బ్లాక్ లేదా బ్లూ పెన్ తప్పనిసరిగా తెచ్చుకోవాలసి అన్నారు. ఈ సమావేశంలో హన్మకొండ, నర్సంపేట ఏసీపీలు చంద్రయ్య, సునితా మోహన్, షీటీం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, జనగామ, నర్సంపేట రీజీనల్ కో-ఆర్డినేటర్లు విజయబాస్కర్, చంద్రవౌళితోపాటు బయోమెట్రిక్ సిబ్బంది పాల్గొన్నారు.