వరంగల్

మాట తప్పిన టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, సెప్టెంబర్ 21: గత ఎన్నికల సమయంలో ప్రజలికిచ్చిన హామీలను, మాటలను అమలుచేయని టీఆర్‌ఎస్ పార్టీకి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవీఎల్ ఎన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంలో భాగంగా జనగామ మండల కమిటి ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. మండల కమిటి అధ్యక్షుడు మార్క ఉపేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పార్టీ జెండాను శామీర్‌పేటలో జిల్లా అధ్యక్షుడు కేవీఎల్ ఎన్‌రెడ్డి ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసిఆర్ తాను చేసిన ఉద్యమం వల్లనే తెలంగాణ వచ్చిందని గొప్పగా చెప్పుకొనే మాటలను ప్రజలు నమ్మరని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు చేసిన కృషిని వివరించారు. మండల కమిటి అధ్యక్షులు మార్క ఉపేందర్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా అనేక కుట్రలు పన్నిందని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను మళ్లించి రాష్ట్ర ప్రభుత్వమే మంజూరి చేస్తుందని అవాస్తవాలు చెప్పి ప్రజలను పక్కదార్లు పట్టించాడని ఆరోపించారు. ఫసల్ బీమా యోజన, ఉజ్వల యోజన, సుకన్య యోజన పథకాలే కాకా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం నేరుగా నిధులు విడుదల చేసేందుకు కృషి చేసిందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కేవీఎల్ ఎన్‌రెడ్డి ద్విచక్ర వాహనాల ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వడ్లకొండ, మరిగడి, గానుగుపహడ్, చిటకోడూర్ గ్రామాల్లో ప్రదర్శన నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా ఉపాధ్యక్షుడు శివరాజ్‌యాదవ్, బీజేపీ మండల కార్యదర్శి బండారి తిరుపతియాదవ్, బీజేవైఎం నాయకులు యాసారపు ప్రతాప్, కే. నర్సిరెడ్డి, అప్పగోని ఎల్లయ్య, దండు మధులు పాల్గొన్నారు.ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే