వరంగల్

24న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌పై సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, సెప్టెంబర్ 21: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కోసం భూమి సేకరించిన చిద్నెపల్లి, గారెపల్లి, కాటారం, ఆదివారంపేట, గుమ్మళ్ళపల్లి, వీరాపూర్, గూడూరు, కొత్తపల్లి, ధన్‌వాడ గ్రామాల ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియజేయడానికి సదస్సు ఏర్పాటుచేసినట్లు కాటారం తహాశీల్ధారు కంకాణాల రవిరాజాకుమార్ తెలిపారు. ఈనెల 24న ఉదయం 10 గంటలకు కాటారం మండల కేంద్రమైన గారెపల్లిలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశానికి పర్యావరణ ఇంజనీర్ వరంగల్ ప్రాంతీయ కార్యాలయం అధికారులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. సంబంధిత ప్రజలు సకాలంలో సదస్సుకు హాజరై తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను తెలియజేయాలని కోరారు.

దళితులకు 2 వేల పాడిగేదెల మంజూరు * నేడు లబ్ధిదారుల ఎంపిక: పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట, సెప్టెంబర్ 21: నర్సంపే ట నియోజకవర్గంలోని 6 మండలాల కు చెందిన 1000 మంది దళిత రైతుల కు 2వేల సబ్సిడీ పాడిగేదెలు మంజూ రు అయ్యాయని, శనివారం ఉన్నత స్థాయి కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేయనుందని రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గానికి పైలట్ ప్రాజెక్టు కింద పాడిగేదెల యూనిట్లను తాను తీసుకవచ్చానని వెల్లడించారు. 1000 పాడిగేదెల యూనిట్లు మంజూరు అయ్యాయని, ఒక్కో యూనిట్‌లో 2 పాడిగేదులు ఉంటాయని, యూనిట్ ధర లక్షా యాబై రూపాయలని చెప్పారు. దీనిలో లక్షా ఐదు వేల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోందని, 45 వేల రూపాయలు మాత్రమే లబ్ధిదారుడు నేరుగా చెల్లించాలని, లేకపోతే బ్యాంక్ కాన్‌సెంట్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఇరవై గుంటల స్థలం ఉన్న వారికి వ్యక్తిగతంగా ఈయూనిట్లను మంజూరు చేస్తారని, లేని వారికి గ్రూపులుగా మంజూరు చేస్తారని అన్నారు. అలాగే మరో 14 వందల మంది చదువుకున్న దళిత నిరుద్యోగ యువతకు మూడు రోజుల పాటు అగ్రీ ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. శిక్షణ తీసుకు న్న వారికి వివిధ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, ఇవ్వలేని వారికి సబ్సిడీతో కూడిన వివిధ యూనిట్లు మంజూరు చేస్తారని పేర్కొన్నారు. ఎనిమిది జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సంస్థలు శుక్రవారం నర్సంపేటలోని రెడ్డి కళ్యాణ మండపం లో శిక్షణ కోసం యువతను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు ఇచ్చే శిక్షణలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. బీసీలకు ఇప్పటికే నూరు శాతం సబ్సిడీతో మంజూరు అయిన యూనిట్ల చెక్కులను శుక్రవారం అధికారులు పంపిణీ చేస్తారని వివరించారు. ఈవిలేఖరుల సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, నల్లా మనోహర్‌రెడ్డి, దార్ల రమాదేవి, నాయిని నర్సయ్య, మండల శ్రీనివాస్, గోనె యువరాజు, గంప రాజేశ్వర్ పాల్గొన్నారు.
* నేడు ఎంపీ, కలెక్టర్ రాక
నర్సంపేట పట్టణంలోని రెడ్డి కళ్యా ణ మండపంలో శుక్రవారం జరిగే దళి త సామాజిక వర్గానికి సంక్షేమ పథకా ల లబ్దిపై జరిగే సదస్సుకు మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయ క్, జిల్లా పరిషత్ చైర్మన్ గద్దల పద్మ, కలెక్టర్ హరిత, ఎస్సీ కార్పోరేషన్ ఎండీ లచ్చిరాంనాయ్, ఇడీ సురేష్‌లు హాజరవుతున్నట్లు సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

భారీ మెజార్టీతో గెలిపించండి: స్పీకర్ సిరికొండ

మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 21: ముం దస్తు ఎన్నికలలో భూపాలపల్లి నియోజవర్గం నుండి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని శాసనసభాపతి సిరికొండ మధుసూధనాచారి అన్నారు. శుక్రవారం మొగుళ్ళపల్లిలో జరిగిన తెరాస విసృత స్థాయి కార్యకర్త ల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 70 ఏళ్ల సుదీర్ఘ పాలనలో ఏ పార్టీ చేయని అభివృద్ధి నాలుగున్నార సంవత్సరాలలో చేసి చూపించానని తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రయోజనం కోసం అమలు చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకవెళ్లి ప్రజలను చైతన్యం చేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు. మారుమూల ప్రాంతమైన మొగుళ్ళపల్లి మం డలాన్ని ఎవ్వరు ఉహించని విధంగా మంచిర్యాల, గోదావరిఖని, ప్రాంత వాసులంతా మొగుళ్ళపల్లి మీదుగా హన్మకొండకు చేరే విధంగా రవాణ సదుపాయం కల్పించి మొగుళ్ళపల్లి మండల కేంద్రాన్ని ముఖ్యమైన కేంద్రం గా మారుస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం సాధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో ఇంటింటికి తిరిగి చైతన్యం చేసి కారు గుర్తుకు ఓటు వేసేలా కష్టపడితేనే భారీ మేజార్టీ సాధ్యం అని అన్నారు. ఇతర నియోజవర్గలకు అభివృద్ధికి ఇచ్చిన నిధుల కంటే ఎక్కువగా 250 కోట్ల నిధులను కేసీఆర్ చొరువతో సాధించి అభివృద్ధి చేశానని అదే విధంగా మరోమారు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నాలుగు వందల కోట్లతో జయశంకర్ జిల్లా రూపురేఖలను మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏ నాయకుడు తిరగని విధంగా పల్లె నిద్రల పేరిట 60 గ్రామా ల్లో నిద్ర చేశానని ఆ పల్లె వాసుల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకున్నాని అన్నారు. కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలోనే భూపాలపల్లి నియోజకవర్గంలో తెరాసను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు బహుమానంగా ఇవ్వాలని కార్యకర్తలను కోరారు. ఆయన వెంట నవనీతరావు, పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతిరావు, రైతు సమన్వయ సమితి చదువు అన్నారెడ్డి పాల్గొన్నారు.