పశ్చిమగోదావరి

ఆయుష్మాన్ భారత్‌తో మోదీకి అండగా నిలుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 25: ఆయుష్మాన్ భారత్ పథకంతో ప్రతి గృహం ఆరోగ్యవంతంగా ఉండాలని భారతీయ జనతాపార్టీకి చెందిన నరసాపురం ఎంపీ డాక్టర్ గోకరాజు గంగరాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు కలిగిన పేదలు, నిరుపేదలందరూ ఈ పథకానికి అర్హులన్నారు. టీ అమ్ముకుని ఎన్నో కష్టనష్టాలను అనుభవించి నరేంద్ర మోదీ దేశానికి ప్రధాన మంత్రి అయ్యారని, అందువల్ల దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, పేదలకు నిరుపేదలు ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనను ప్రారంభించారని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యానికి 90 శాతం నిధులు ప్రధాని నరేంద్రమోదీ కేటాయించారన్నారు. కేవలం ఈ రాష్ట్రం 10 శాతం నిధులు వైద్యానికి ఇస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. మంగళవారం భీమవరంలోని త్యాగరాజ భవనంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని ఎంపీ గోకరాజు గంగరాజు, జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ముందుగా భారతమాత చిత్రపటానికి, దీన్‌దయాల్ ఉపాధ్యాయ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటాలకు పూలమాల వేశారు. చేశారు. పట్టణ అధ్యక్షుడు కాయిత సురేంద్ర ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ ఇప్పటికే విద్య, ఆరోగ్యంతోపాటు సుమారు 130 పథకాలను దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారన్నారు. ఇటీవల పోస్టల్ బ్యాంకును ప్రారంభించారని, బీజేపీ వారికి నోరు ఉందని, తెలుగుదేశం ప్రభుత్వానికి మీడియా ఉందని, అయినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మన నోటి ప్రచారంతో ముందుకు సాగుదామన్నారు. ఈ రాష్ట్రానికి ఎఇడి దీపాలు, గ్యాస్, నిరంతర విద్యుత్, మరుగుదొడ్లు, పట్టణాలు, గ్రామాల్లో రహదారులు, త్రాగునీటి అవసరాల కోసం అమృత్ పధకాలను అమలు చేస్తోంది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. విడిపోయాం కరక్టే కాని డబ్బులు ఎవరిచ్చారో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాలని ఎంపీ ప్రశ్నించారు. డెబ్భై ఏళ్లలో జరగనివి 2014 బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్నాయన్నారు. జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్‌లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం రూ.12 వేలు వ్యయంతో మరుగుదొడ్లను నిర్మిస్తోందని, దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ.3 వేలు ఇవ్వలేక చేతులెత్తేసిందని చెప్పారు. దీనిదయాల్ స్ఫూర్తితో అత్యోదయ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే బీజేపీ సిద్ధాంతమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ గోకరాజు గంగరాజు కేకును కట్ చేసి సంబరాలు జరిపారు. అదే విధంగా ఆయుష్మాన్ భారత్ పథకం పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాకా సత్యనారాయణ మాట్లాడారు. జిల్లా ఉపాధ్యక్షుడు అల్లూరి సాయిదుర్గరాజు, ప్రధాన కార్యదర్శి సుభాష్, కార్యదర్శి అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఎస్సీ మోర్చ అధ్యక్షుడు బూసి సురేంద్రనాధ్ బెనర్జీ, ఒబిసీ మోర్చ అధ్యక్షుడు కోమటి రవికుమార్, కోరా రామ్మూర్తి, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కురెళ్ల నర్సింహరావు, తోట గంగరాజు, మండల అధ్యక్షుడు కొల్లాడి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రాట్నాల సత్యనారాయణ, సోము సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రైళ్లను కూతపెట్టించండి
* రైల్వే జీఎం వినోద్‌కుమార్‌కు ఎంపీ తోట లేఖ
భీమవరం, సెప్టెంబర్ 25: రాష్ట్ర విభజన తర్వాత అత్యంత కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని రైల్వే శాఖ ఒక్క రైలును కూడా కూత పెట్టించలేదని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి రైల్వే అధికారులను ప్రశ్నించారు. చూస్తూ ఉన్నాం కదా అని రైల్వే శాఖ నిర్లక్ష్యంగా ఇక్కడి రైలు ప్రయాణికుల పట్ల వ్యవహరిస్తోందన్నారు. జిల్లాలోని రైల్వే సమస్యలపై విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్‌కు మన ఎంపీలతో కలిసి లేఖను అందించారు. అసలు రైల్వే జోన్ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. నరసాపురం-కోటిపల్లి పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తోట కోరారు. ఇక కొవ్వూరు-్భద్రాచలం రైల్వే లైన్ పనులు సర్వే దశలోనే ఉన్నాయని, వాటికి నిధులు కేటాయించి పనులు వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. నరసాపురం-విజయవాడ-్భమవరం-నిడదవోలు డబ్లింగ్ పనులు 2019 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని, ఆ విధంగా చర్యలు చేపట్టాలన్నారు. భీమవరం టౌన్ పరిధిలోని రైల్వే లెవిల్ క్రాసింగ్ వద్ద కొత్త గేటు త్వరగా ప్రారంభించాలని, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ షిర్డీ వరకు కొనసాగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మచిలీపట్నం-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకి అనుసంధానంగా నరసాపురం నుంచి గుడివాడ వరకు లింక్‌ను నడపాలన్నారు. కాకినాడ నుంచి చెన్నై వెళ్ళు సర్కార్ ఎక్స్‌ప్రెస్ రద్దీ దృష్ట్యా ఎపీ కోచ్‌తో పాటు రెండు స్లీపర్ బోగీలు కేటాయించాలని కోరామని ఎంపీ తోట సీతారామలక్ష్మి మంగళవారం చెప్పారు.