పశ్చిమగోదావరి

బౌద్ధిజమే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు, అక్టోబర్ 14:సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికి బౌద్ధిజమే శరణ్యమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధదేవ్‌ప్రసాద్ స్పష్టం చేశారు. ఉండ్రాజవరం బౌద్ధ ధర్మ పీఠం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విశ్వజననీయ మానవతా ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా కులాల, మతాల పేరిట జరుగుతున్న విభజనను బౌద్ధిజం ఎదుర్కొనగలదని బుద్ధదేవ్ ప్రసాద్ అన్నారు. మనిషిని మనిషిగా ఉన్నతునిగా తీర్చిదిద్దేది బౌద్ధిజమని ఆయన చెప్పారు. సమత, మమత, సమానత్వం బౌద్ధిజంలోనే సాధ్యమని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు బౌద్ధిజం విరాజిల్లిందని ఆయన చెప్పారు. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ మానవ విలువలు పెంచేందుకు బౌద్ధదమ్మం దోహదపడుతుందన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ సమాజాభివృద్ధికి బౌద్ధిజం సహకరించగలదని తెలిపారు. దమ్మపీఠం వ్యవస్థాపకుడు బందే అనాలియో అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవంలో చైనా, థాయ్‌లాండ్, బర్మా దేశాలకు చెందిన బౌద్ధ్భిక్షువులు పెద్దసంఖ్యలో పాల్గొని బౌద్ధిజానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎనిమిది లక్షల మందితో కలిసి బౌద్ధిజంలో చేరి 60 ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన ఈ మానవతా సభలో ప్రముఖ సంఘ సేవకుడు డీవీవీఎస్ వర్మ, రిటైర్డు డీజీపీ యు ఆంజనేయరెడ్డి, ప్రొఫెసర్ సీహెచ్ స్వరూపారాణి, ఉండ్రాజవరానికి చెందిన మల్లిన సత్యనారాయణ, ఎస్‌కెఎస్‌డీ విద్యాసంస్థల అధినేత చిట్టూరి సుబ్బారావు, శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణారావు, ప్రజావైద్యుడు తాతిన రామబ్రహ్మం, టీడీపీ మండలాధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, మాజీ అధ్యక్షుడు కుదప చక్రపాణి, ఎంపీపీ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కరిస్టులు, బౌద్ధదమ్మ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనటంతో సభాప్రాంగణం కిక్కిరిసింది.