పశ్చిమగోదావరి

సరస్వతి దేవి అవతారంలో అంబికాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 14 : స్థానిక సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో వేంచేసియున్న శ్రీ అంబికాదేవి ఆలయంలో ఆదివారం మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారికి సరస్వతి దేవి అలంకరణ చేశారు. ఉదయం ఆలయ ప్రదక్షిణ, గణపతిపూజ, మండపారాధన, గోపూజ, ఉత్సవ మూర్తికి అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. సరస్వతి దేవి అలంకారం కావడంతో విద్యార్దినీ విద్యార్ధులు సామూహిక సరస్వతి పూజ నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జి రాజేష్ బృందం ఆధ్వర్యంలో నాట్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం హారతులు, దర్బారు సేవ, నీరాజన మంత్రపుష్పములు ఇచ్చారు. ఎఫ్‌డిసి ఛైర్మన్ అంబికా కృష్ణ కుటుంబ సభ్యులు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం పెద్ద సంఖ్యలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.