క్రైమ్/లీగల్

కానూరులో ఇరువర్గాల ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరవలి, అక్టోబర్ 23: కానూరులో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఒకరికి గాయాలు తగలడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఒక వర్గం వారు గాయపరిచిన నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిడదవోలు-నరసాపురం రహదారిపై బైఠాయించి నాలుగు గంటల పాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించి ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. కానూరులో సోమవారం రాత్రి మోటారు సైకిల్ నడుపుతున్న గంధం దొర, ఆటో నడుపుతున్న గుజ్జా చిరంజీవిలు ఢీకొని గొడవపడ్డారు. గొడవ పరిష్కారానికి గ్రామపంచాయతీ వద్ద గ్రామపెద్దల సమక్షంలో ఇరువర్గాలు సమావేశమయ్యారు. ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. దాంతో గంధం దొర ఆటోడ్రైవరు గుజ్జా చిరంజీవి వర్గంలోని జీడి గుంట భీమరాజును కొడవలితో నరికాడు. దాంతో తీవ్ర గాయాలు తగిలిన భీమరాజును తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో కొడవలితో దాడి చేసి గాయపర్చిన నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ క వర్గం వారు రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు నాలుగు గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో ఆందోళన విరమించారు. ఈ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఈ సంఘటనతో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో తణుకు సర్కిలు పరిధిలోని పోలీసులు అధిక సంఖ్యలో మోహిరించారు. తణుకు సీఐ ఎ స్వామి ఆధ్వర్యంలో పెరవలి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.