పశ్చిమగోదావరి

విరాళాలు సేకరించైనా పోలవరం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి, నవంబర్ 14: విరాళాలు సేకరించైనా సరే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, రాష్ట్రం పట్ల కేంద్రం జిమ్మిక్కులు నెరవేరవని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్ అన్నారు. బుధవారం తాళ్లపూడి మండలంలో ఎక్సయిజ్ మంత్రి కెఎస్ జవహర్ చేపట్టిన ద్వారకాతిరుమల పాదయాత్రలో ఎంపీ మాగంటి పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి 2014లో కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. కేంద్రంలో ప్రధానిని నిర్ణయించే నిర్ణయాత్మక శక్తి టీడీపీదే అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రెండంకెల అభివృద్ధి సాధించిందన్నారు. కాగా అన్నదేవరపేటలో మంత్రి జవహర్ చేపట్టిన పాదయాత్రకు మురళీమోహన్ జెండా ఊపి ప్రారంభించారు.
నిర్వాసితుల కాలనీల్లో స్వచ్ఛ్భారత్ మరుగుదొడ్ల నిర్మాణం: ఐటీడీఏ పీవో
బుట్టాయగూడెం, నవంబర్ 14: ఏజన్సీలోని మండలాలల్లో నిర్మిస్తున్న నిర్వాసితుల కాలనీల్లో మరుగుదొడ్లను స్వచ్ఛ్భారత్‌లో భాగంగా నిర్మిస్తామని ఐటీడీఏ పీవో హరీంద్రియ ప్రసాద్ స్పష్టం చేశారు. కోటరామచంద్రపురం ఐటీడీఏ వద్ద పీవో బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల ఒక రాజకీయ పార్టీనేతలు నిర్వాసిత కాలనీలను సందర్శించినపుడు మరుగుదొడ్లు నిర్మాణంపై తలెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ, మరుగుదొడ్లను స్వచ్ఛ్భారత్‌లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 41.06 కాంటూరుకు 29గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఆగ్రామాల్లో 1609 గిరిజన కుటుంబాలకు నష్టం కలగనున్నట్లు చెప్పారు. వారికి జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, కుక్కునూరు మండలాల్లో 17 లే అవుట్లలో గృహాలను నిర్మిస్తున్నట్లు పీవో చెప్పారు. బుట్టాయగూడెంలో 171, దొరమామిడిలో 49, స్వర్ణవారిగూడెంలో 450, రాచన్నగూడెంలో 140, రౌతుగూడెంలో 137, ములగలంపల్లిలో 80, పెదరాయగూడెంలో 127, కివ్వాకలో 130, దామరచర్లలో 80, దాచారంలో 10 గృహాలను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఐదుసెంట్ల ఇంటిస్థలంలో 379 చదరపు అడుగుల్లో ఇంటినిర్మాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మెనూ, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలకు వెనుకాడేది లేదని అన్నారు.