పశ్చిమగోదావరి

సకాలంలో సమస్యలు పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 14 : సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిస్కారం కోరుతూ ఈ నెల 5వ తేదీ నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెబాట చేపట్టారు. దశల వారీగా ఆందోళన చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుని ఈ నెల 12వ తేదీన డిసిసిబి వద్ద ధర్నా జరిపారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు జిల్లా సహకార ఉద్యోగుల యూనియన్ నాయకులను చర్చలకు ఆహ్వానించడంతో మంగళవారం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పివి సత్యనారాయణరాజు, జిల్లా అధ్యక్షులు ఆకన లక్ష్మణస్వామి, ప్రచార కార్యదర్శి టి కిషోర్‌కుమార్, కో ఆర్డినేటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, కన్వీనర్ పి నరసింహరాజు, నాయకులు ఎస్ ఎం వలీ, విజయ్, వెంకటేశ్వరరావుల బృందం చర్చలకు వెళ్లింది. ఈ సందర్భంగా ఆప్కాబ్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే వుందని, అయినప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల కోర్కెలు సమంజసమైనవని అంగీకరించి చంద్రబాబుతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని, ఆందోళన కొనసాగించవద్దంటూ హితవు పలికారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలంటూ పి ఎ సి ఎస్ ఉద్యోగుల నాయకులు కోరారు. ఒక నెల గడువు కావాలంటూ ఆప్కాబ్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు యూనియన్ నాయకులను కోరారు.
నరసాపురం పార్లమెంట్ బీజేపీ ఇన్‌ఛార్జిగా ఆకుల
భీమవరం, నవంబర్ 14: భారతీయ జనతా పార్టీ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్‌లకు ఇన్‌ఛార్జిలను నియమించింది. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను పార్టీ నియమించింది. అదే విధంగా కన్వీనర్‌గా ప్రస్తుత ఎంపీ డాక్టర్ గోకరాజు గంగరాజు, కో కన్వీనర్‌గా పాలకొల్లుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావూరి సుధను నియమించారు. అదే విధంగా ఏలూరు పార్లమెంట్‌కు ఇన్‌ఛార్జిగా తుమ్మల అంజిబాబు, కన్వీనర్‌గా కెఎల్ కృష్ణప్రసాద్, కో కన్వీనర్‌గా జేపీ రామ్మోహన్‌ను నియమించారు. పార్టీ నియమించిన పార్లమెంట్ ఇన్‌ఛార్జిలు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు నిత్యం పార్లమెంట్‌లో పర్యటనలు చేసి, సభలు సమావేశాల్లో క్యాడర్‌తో మమేకమవుతూ బూత్ స్థాయిలో పార్టీని పటిష్ఠం చేసుకోవాల్సి ఉంటుంది.