పశ్చిమగోదావరి

డిసెంబరు నెలాఖరుకు ప్రోత్సాహకాలు, ఉపకరణాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 14 : జిల్లాలో కొత్త పంటల విస్తరణతోపాటు ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఉపకరణాల పంపిణీ డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఉద్యాన శాఖాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఉద్యాన రంగ ప్రగతి తీరును సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళిక బద్ధంగా పనిచేస్తే మంచి ఫలితాలు సాదించవచ్చన్నారు. అయితే ఇది సంబంధిత అధికారులతో కొరవడడం మూలంగా లక్ష్యసాధన జరగడం లేదన్నారు. ప్రధాన ఉద్యాన శాఖాధికారుల నుండి ఎంపిఇవోల వరకూ శాఖాపరంగా నిర్వర్తించవలసిన విధుల్లో సానుకూల దృక్పధం కనపడడం లేదన్నారు. జిల్లాలో 3335 హెక్టార్లలో అదనంగా ఆయిల్‌ఫామ్ విస్తరణ చేపట్టాలని లక్ష్యంగా నిర్ధేశిస్తే అందుకు కావలసిన ప్లాంటేషన్ మెటీరియల్ ముందుగా అందుబాటులో ఉంచుకోవల్సి వుండగా ఇప్పటి వరకూ ఈ విషయంలో జాప్యం చేయడంపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. జిల్లాలో క్రాప్ డైవర్షన్ తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. అదే విధంగా కొబ్బరి, కోకో, జీడిమామిడి పంటల సాగు విస్తరణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జీడి ప్రోసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయని, ఇక్కడ సరైన రీతిలో పంట విస్తరణ జరగక ఇతర ప్రాంతాల నుండి జీడి పిక్కలను తీసుకొచ్చుకొని ప్రోసెసింగ్ చేస్తున్నారన్నారు. ప్లాస్టిక్ ట్రేలు 25 వేలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశిస్తే ఇంత వరకూ కేవలం 14 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. ఉద్యాన రంగంలో ఆయా అంశాల వారీగా నిర్ధేశించిన లక్ష్యాల్లో 80 శాతం రానున్న 15 రోజుల్లో సాధించని వారిని గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 80 శాతంకన్నా లక్ష్యసాధన తక్కువగా ఉన్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ పొందాలన్నారు. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఉద్యాన రంగంలో చేపట్టే విస్తరణ, ఇతర కార్యక్రమాల అమలుకు రానున్న జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రణాళిక చేసేందుకు సిద్ధంగా వుండాలన్నారు. గ్రామాల్లో ఉద్యాన రైతులకు సహకారంగా ఉండేందుకు నియమించిన ఎంపిఇవోలు ఎక్కడ నివాసముంటున్నది వారి నుండి ధృవీకరణ తీసుకోవాలని ఉద్యాన శాఖ డిడి సుబ్బారావును కలెక్టర్ ఆదేశించారు. చుట్టపు చూపుగా గ్రామాలకు వెళితే రైతులతో సత్సంబంధాలు ఎలా వుంటాయని ప్రశ్నించారు. ప్రభుత్వం అందించే ప్రయోజనాలను రైతులు వినియోగించుకొనేలా సంబందిత అధికారులు, సిబ్బంది దృష్టి పెడితే వారిపై విశ్వాసం కలుగుతుందన్నారు. జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు అవకాశాలు పుష్కలంగా వున్నప్పుడు ఈ ఏడాది కేవలం 21 వేల హెక్టార్లకు విస్తరణకు వెళితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యాన పంటలకు సంబంధించి 92 వేల మంది రైతులకు భూసార పరీక్షా కార్డులు అందించవలసి వుండగా 54 వేలు ముద్రింపబడి అందులో ఇంత వరకూ 25 వేల కార్డులు మాత్రమే పంపిణీచేశారని వచ్చే వారంనాటికి మిగిలిన కార్డులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ఆదిత్య ప్రకాష్, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బారావు, అసిస్టెంట్ డైరెక్టర్లు దుర్గేష్, బాలాజీకుమార్ తదితరులు పాల్గొన్నారు.

శ్మశాన వాటికల ఆక్రమణలు తొలగించాలి: కారెం శివాజీ
ఉండి, నవంబర్ 14: దళిత వాడల్లో శ్మశాన వాటికల ఆక్రమణలపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొలగించి ప్రతీ గ్రామంలో దళితవాడలో శ్మశానవాటికలకు రక్షణ కల్పించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉండి, వాండ్రంలలో ఆయన పర్యటించారు. ఉండిలో విజయకుమార్ ఇంటివద్ద నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉపాధిహామీ నిధులతో శ్మశానవాటికల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఇంకా వివక్షత కనబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ వంటి ప్రాంతాల్లో కర్నాటక సరిహద్దు జిల్లాల్లో, ఎంతో అభివృద్ధి చెందిన తూర్పుగోదావరిజిల్లాలో ఇటువంటి సంఘటనలు తన దృష్టికి వచ్చాయని ఆయన వెల్లడించారు. తమ కమిషన్ ఇప్పటి వరకు 10 వేల కేసులు పరిశీలించగా అందులో 8,500 కేసుల సమస్యలు పరిష్కరించినట్టు ఆయన వెల్లడించారు. సమాజంలో దళితులకు న్యాయం చేయాలన్న మార్పు తీసుకురావాలని ఆయన యువతను కోరారు. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మెన్ కారెం శివాజీ స్పష్టం చేశారు. అయితే తాను ఎక్కడ నుండి పోటీ చేసేది చంద్రబాబునాయుడు నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా బీజేపీ,వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలపై పార్టీ నేతలపైన ఘాటైన విమర్శలు గుప్పించారు. కేంద్రం సహకరించకపోయినా రాష్టమ్రుఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంతో అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు.