పశ్చిమగోదావరి

విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 14 : విద్యార్ధినీ విద్యార్దులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారి అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. బుధవారం స్థానిక వట్లూరు సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్‌కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ముఖ్య అతిధిగా పాల్గొని బాలల దినోత్సవం సందర్బంగా బాలలను అభినందించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనచేసి అనంతరం కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులన్న నానుడిని సార్ధకమయ్యేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన ఆటల పోటీలు, డ్రాయింగ్, ఎస్ ఐ వ్రైటింగ్, రోబ్‌స్కిప్పింగ్, రన్నింగ్ తదితర క్రీడా పోటీల్లో విజయం సాధించిన బాల బాలికలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. బాలల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. జవవహర్‌లాల్ నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా బాలల అభివృద్ధికి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకూ నిర్వహించే బాలల హక్కుల వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. బాలల స్నేహ గ్రామం నిర్మించడం మన బాద్యత అని కలెక్టర్ చెప్పారు. గ్రామ బాలల రక్షణ కమిటీ, బాలల పంచాయితీ, బాలల హక్కుల కోసం పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక మాట్లాడుతూ చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లాలోని ప్రతీ గ్రామంలో పాఠశాలలోని విద్యార్ధినీ విద్యార్దులకు బాలల హక్కులపై అవగాహన కల్గించడం జరుగుతుందని చెప్పారు. ఈకార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి బ్రహ్మానందరెడ్డి, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి ఎస్ బాబు, ఆర్‌వి రమణ, డిప్యూటీ డి ఇవో ఉదయ్‌కుమార్, జిల్లాలోని అన్ని మండలాల ఎంఇవోలు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.