పశ్చిమగోదావరి

సహాయ పునరావాస ప్యాకేజీలో బహిరంగ దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, నవంబర్ 14: పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలలో అవినీతి జరిగిందని విన్నాముగాని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో బహిరంగ దోపిడీ జరిగిందని, రౌడీయిజంగా అస్మదీయులకు ప్యాకేజి సొమ్ము కోట్లాది రూపాయలు దోచి పెట్టారని చల్లావారిగూడెంలో అర్థమైందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. మండలంలోని తాడువాయి శివారు చల్లావారిగూడెం గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద సేకరించిన భూములు, ప్యాకేజీ సొమ్ము కైంకర్యానికి గురైన కోదండరామాలయం భూములు బుధవారం ఉండవల్లి అరుణ్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పట్టిసీమలో అవినీతి జరిగిందంటే ప్రాజెక్టు అర్జంట్ కాబట్టి ఎంత అడిగితే అంత ఇచ్చేసామన్నారని, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటే సాగునీరు ఇవ్వడం అర్జెంటు కాబట్టి వెయ్యి ఇవ్వాల్సిన చోట పది వేలు ఇచ్చామని సమర్థించుకున్నారని, కానీ ఇక్కడ లేనివి ఉన్నట్టు సృష్టించి అధికార పార్టీ రైతులకు ఆర్ అండ్ ప్యాకేజి దోచి పెట్టారని విమర్శించారు. ఒక చోట ఒక కొబ్బరి చెట్టు ఉంటే భవనాలు ఉన్నట్టు, మరో చోట పది పామాయిల్ చెట్లు ఉంటే భవనాలు ఉన్నట్టు, హార్టీకల్చర్ యాక్టివిటీ ఉనట్టు కోట్లు దోచేశారని అన్నారు. ఇది బంహిరంగ దోపిడీ అని, తాను ఎన్నో కుంభకోణాలు చూసానని, ఇంతటి బహిరంగ దోపిడీ చూడటం ఇదే మొదటిసారన్నారు. స్థానికంగా మేనేజ్ చేసి చేసారా? లేక చంద్రబాబు క్యాబినెట్‌కు తెలిసే చేసారా? అన్నది విచారించాల్సి ఉందన్నారు. న్యాయవాదిగా తాను ఏమిచేయాలో ఆలోచిస్తానన్నారు. మోసం చేసిన వారు కూడా తెలివిగా చేస్తారని, ఇంత నేరుగా చేయరన్నారు. పంట పొలాల్లో భవనాలు లేకుండా ఉనట్టు ప్యాకేజి కోట్లలో దోచిపెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వ సొమ్ము అంటే మాదే అన్నట్టు తీసేసుకున్నారని, పక్క రైతులకు మాత్రం ఎకరాకు 25 లక్షలే చెల్లించి, తమవారి భూములకు కోట్లలో చెల్లించడం చూసి విస్తుపోయానన్నారు. రైతులందరికీ దందాలో సమన్యాయం జరగలేదన్నారు. అందుకే కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్నారు. దేవుని మాన్యం భూములు కైంకర్యం దారుణమన్నారు. దేవుని భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు చెల్లవన్నారు. దేవునికైతే నోరు లేదు, నోరున్న మీరేం చేస్తున్నారని రైతులను ఉండవల్లి ప్రశ్నించారు. ఏం చేసినా ఎవర్రా మమ్మల్ని అడిగేది, మాయిష్టం అన్నట్టు వింత ధోరణిలో చేసుకుపోయారన్నారు. వెనుకబడిన మెట్ట ప్రాంతం ఇక్కడ ఎవరు అడుగుతారులే అని చేసారా? అన్నట్టు ఉందన్నారు. అధికారులు కూడా ఇంత విచ్చలవిడిగా ఎలా ఇచ్చారో తెలియడం లేదన్నారు. పరిహారం చెల్లింపు సమయంలో నోట్ తయారు చేసుకుని భూములు పరిశీలించి, వాటి స్వభావం తెలుసుకుని చెల్లించాలని, అటువంటివేమీ లేకుండా అస్మదీయులనుకున్న వారి కోట్లు దోచిపెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు, తాడువాయి మాజీ ఎంపీటీసీ సత్రం లక్ష్మణరావు, సహకార సంఘ అధ్యక్షుడు కనికెళ్ళ ప్రసాద్‌బాబు, ఎ.పోలవరం మాజీ సర్పంచ్ బుద్ధాల సత్యనారాయణ, రైతు నాయకులు చీదిరాల నాగేశ్వరరావు, సత్రం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.