పశ్చిమగోదావరి

జెమ్ ఆన్‌లైన్ ప్రభుత్వ పోర్టల్ ద్వారా వస్తు సామాగ్రిని కొనుగోలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 16 : జిల్లాలో ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో జెమ్ ఆన్‌లైన్ ప్రభుత్వ పోర్టల్ ద్వారా వస్తు సామాగ్రిని కొనుగోలుచేయాలని ఏపీ రాష్ట్ర ప్రతినిధి మహమ్మద్ నిజాముద్దీన్ అధికారులకు చెప్పారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులకు జెమ్ ఆన్‌లైన్ పోర్టల్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాముద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఇ-మార్కెట్ ద్వారా పారదర్శక పాలన అందించేందుకు ఆన్‌లైన్ విధానం అమలుచేయాలని అధికారులకు నిజాముద్దీన్ చెప్పారు. ప్రభుత్వ కార్యాలయ పనులకు సంధించిన కొనుగోలుచేయవల్సిన వివిధ సామాగ్రిని ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు కొనుగోలుచేయడమే జెమ్ ఆన్‌లైన్ పోర్టల్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ శాఖల అధికారులు ఆన్‌లైన్ విధానంపై పూర్తి అవగాహన కలిగి వుండాలని ఆయన చెప్పారు. కార్యాలయాలకు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలు తక్కువ ధరకు తక్కువ సమయంలోకొనుగోలు చేయడమే జెమ్ ప్రభుత్వ ఆన్‌లైన్ పోర్టల్ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ఈ సందర్భంగా ఇ-మార్కెటింగ్ ద్వారా రూల్స్ సర్వీసెస్‌లను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి వివరాలను అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నిక్‌నెట్ అధికారి జివి ఎస్ శర్మ, సహాయకులు శ్రీనివాస్, వివిద ప్రభుత్వ శాఖాధికారులు పాల్గొన్నారు.