పశ్చిమగోదావరి

అమర వీరుల ఆశయాలను కొనసాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి నరసాపురం, నవంబర్ 16: భూమి, భుక్తి, విముక్తి కోసం అమర వీరుల ఆశయాలను కొనసాగించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ కన్వీనర్ కామ్రేడు విమలక్క అన్నారు. మండలంలోని మర్రిగూడెం పంచాయతీలోని సున్నపురాళ్లపల్లిలో కామ్రేడు చండ్ర పుల్లారెడ్డి 35వ వర్థంతి వేడుకలు వేగేశ్న సత్యరాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విమలక్క మాట్లాడుతూ మర్రిగూడెం ప్రాంతంలో గిరిజనులు పోరాడి సాధించుకున్న 79 ఎకరాల భూమి గిరిజనుల ఆధీనంలోనే ఉన్నప్పటికీ అధికారులు సాగు పట్టాలు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయకపోవటం శోఛనీయమన్నారు. నేటికీ లక్షల ఎకరాల భూములు కబ్జాదారుల చేతిలోనే ఉన్నాయన్నారు. భూకబ్జాదారులకు పాలకులు ఊడిగం చేస్తున్నారన్నారు. భూమిపై ఆధారపడి జీవించే గిరిజనులకు భూములు అందించాలని డిమాండు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను బాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన కళాకారులను చంద్రబాబు ప్రభుత్వం అరెస్టుచేయించటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతుకూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కె వీరాంజనేయులు, కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.