పశ్చిమగోదావరి

రైతన్నకు నష్టం మిగిల్చిన గజ తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, నవంబర్ 17: గజ తుపాను రైతులను గజగజలాడించింది. తీరం దాటే వరకూ రైతులకు ముచ్చెమటలు పట్టించింది. తుపాను ప్రభావం ఇక్కడ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రైతన్నలకు మాత్రం ఎంతోకొంత నష్టాన్ని కల్గించింది. పొలాల్లోని కళ్లాల్లో ఉన్న ధాన్యం వర్షాలకు తడిసి ముద్దయింది. నియోజకవర్గ పరిధిలోని వందలాది ఎకరాల్లోని పంట శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షానికి నీట మునిగింది. ప్రస్తుతం రైతులు తడిసి ముద్దయిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలో పడ్డారు. కొందరు రైతులు పాలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ద్వారకాతిరుమల మండలంలో 3,824 హెక్టార్లలో దాళ్వా సాగు చేపట్టారు. సిహెచ్ పోతేపల్లి, శరభాపురం, పి కన్నాపురం, రామన్నగూడెం తదితర గ్రామాల్లోని రైతులు పంటను కోసి పొలాల్లోనే కళ్లాలు వేశారు. అయితే గజ తుపాను ప్రభావం కారణంగా కురిసిన వర్షానికి ధాన్యం కాస్తా పూర్తిగా తడిసిపోయింది. దీంతో శనివారం ఉదయం రైతులు పొలాల్లోని ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. శనివారం సాయంత్రం మళ్లీ వర్షం కురవటంతో రైతులు తలలు పట్టుకున్నారు. తుపాను తీరం దాటినా తమ కష్టాలు మాత్రం తీరటం లేదని వాపోతున్నారు.

క్షీరారామ క్షేత్రాన్ని దర్శించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి శివశంకర్
పాలకొల్లు, నవంబర్ 17: పంచారామ క్షేత్రం క్షీరారామ క్షేత్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి శివశంకర్ శనివారం సందర్శించారు. క్షీరారామలింగేశ్వరస్వామి, జనార్దనస్వామి, పార్వతి, లక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేదాశీస్సులు అందించారు. ఆలయ ఈవో వై భధ్రాజీ, సూపరింటెండెంట్ నరసింహస్వామి, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్డి మోతాలాల్ హైకోర్టు జడ్జి వెంట ఉన్నారు.
శ్రీవారి సేవలో సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్
ద్వారకాతిరుమల, నవంబర్ 17: ప్రముఖ క్షేత్రమైన శ్రీవారి ఆలయాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం రామారావు శనివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేదాశీస్సులు అందజేశారు. ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు ఆయనకు స్వామివారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.