పశ్చిమగోదావరి

హామీలన్నీ నెరవేర్చా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 17 : ఏలూరు నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చానని ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) తెలిపారు. స్థానిక శనివారపుపేట గ్రామ పంచాయితీ శ్రీరామ్‌నగర్‌లో గ్రామదర్శిని - గ్రామ వికాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎంపిపి జయమంగళ వెంకటరమణ, జడ్పీటిసి మట్టా రాజేశ్వరి పాల్గొన్నారు. తొలుత గ్జేవియర్ నగర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి పాదయాత్రగా బయలుదేరి బ్యాంకు కాలనీ, కట్టా సుబ్బారావుతోట, గవరవరం, విద్యానగర్, శ్రీనివాసనగర్‌లలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాసనగర్‌లో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. ఎన్నికల ప్రచారంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చానన్నారు. స్తానికంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. శనివారపుపేట గ్రామ పంచాయితీలోని అన్ని రోడ్లను పూర్తి చేశామన్నారు. రోడ్లు, డ్రైన్లు, పార్కులను అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు తాను కృషి చేస్తున్నానన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు సులేమాన్, వైస్ ఎంపిపి లంకపల్లి మాణిక్యాలరావు, ఎంపిటిసిలు ఆళ్ల మోహనరావు, కూర్మా ఆనందరావు, రూరల్ మండల అధ్యక్షులు అమరావతి అశోక్, ఉపాధ్యక్షుడు నాగరాజు, మాజీ సర్పంచ్ కూరపాటి లూర్ధమ్మ, టిడిపి నాయకులు సత్యవాడ దుర్గా ప్రసాద్, శ్రీ్ధర్‌బాబు, దాసరి ఆంజనేయులు, బ్రహ్మానందం, పి కొండబాబు, జల్లా హరికృష్ణ, సూరత్తు నారాయణ, శనివారపేట గ్రామ పంచాయితీ సెక్రటరీ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ఆక్వా కాలుష్యంతో అనారోగ్యం
*ఎమ్మెల్యే శివరామరాజు పాములపర్రు గ్రామస్థుల ఫిర్యాదు్ర
ఉండి, నవంబర్ 17: మండలంలోని పాములపర్రులో ఆక్వా చెరువు నీరు పంట కాలువలో చేరటంవలన చెరువు నీరు కలుషితమవుతోందని పాములపర్రు ప్రజలు శనివారం ఎమ్మెల్యే శివరామరాజును తీసుకొచ్చి చూపించారు. కలుషిత నీటి కారణంగా తాము కాళ్ల నొప్పులు, వాపులతో బాధపడుతున్నామని ఎమ్మెల్యేకు వివరించారు. మహిళలు వాచిపోయిన, నీరుపట్టిన తమ కాళ్లను ఎమ్మెల్యేకు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉండి నుంచి పాములపర్రు వెళ్లే పంట కాలువలో ఎగువ నుంచి ఆక్వా చెరువులు వదిలిన నీరు కూడా వచ్చి కలుస్తోంది. దీనితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే యండగండి, ఉప్పులూరు, కోలమూరు గ్రామాల మీదుగా పైపులైనుతో రక్షిత మంచినీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు వెంటనే అక్కడ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో కోతుల గుంపులు ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మహిళలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేతోపాటు ఏఎంసీ వైస్ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు, ప్రత్యేకాధికారి సాయిరామ్, గ్రామస్థులు పాల్గొన్నారు.