పశ్చిమగోదావరి

గ్రామీణులకు వరం చంద్రన్న విలేజ్‌మాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, నవంబర్ 17: గ్రామీణ ప్రాంత ప్రజలకు చంద్రన్న విలేజ్‌మాల్ వరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శనివారం ఆచంటలోని కుక్కల విజయభారతి రేషన్‌షాపులో ఏర్పాటుచేసిన చంద్రన్న విలేజ్‌మాల్‌ను మంత్రి పితాని ప్రారంభించి మాట్లాడారు. చౌకధరల దుకాణాలను చంద్రన్న విలేజ్‌మాల్స్‌గా రూపొందించామని, ఇక్కడ నిత్యావసర వస్తువులతోపాటు నాణ్యతతో కూడిన ఇతర సరుకులు లభిస్తాయన్నారు. సప్లయి కంపెనీలు అందించే డిస్కౌంట్‌లో 60శాతం వినియోగదారునికే చెందుతుందన్నారు. అంతేకాకుండా చౌకధరల దుకాణాదారునికి అదనపు ఆదాయం కూడా లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆచంట, పెనుగొండ ఏఎంసీ చైర్మన్లు ఉప్పలపాటి సురేష్‌బాబు, సానబోయిన గోపాలకృష్ణ, ఎంపీపీ మేకా పద్మకుమారి, జడ్పీటీసీ బండి రామారావు, తహశీల్దార్ శ్రీరమణి వాణి, ఆర్‌ఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతులు పండించిన పంటకు దళారీల బాధ లేకుండా గిట్టుబాట ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనాశాఖా మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శనివారం ఆచంట ఏఎంసీలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులకు అవసరమైన ప్రతి చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ఆగస్టు నెలలో సంభవించిన తుపాను, వరదల వల్ల నష్టపోయిన 13మందికి రూ. 1.6 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి అందించారు.