పశ్చిమగోదావరి

ప్యాకేజీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 17 : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అమలు చేసే పునరావాస ప్యాకేజీ పనుల్లో అవకతవకలకు పాల్పడితే ఏ స్థాయి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్, జాతీయ, ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణం, నీటిపారుదల, తాగునీరు తదితర పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ అండ్ ఆర్ పనుల బిల్లుల చెల్లింపు విషయంలో కాంట్రాక్టర్లు ఏ ఒక్కరికి నయా పైసా ఇవ్వక్కర్లేదని, బిల్లులు చెల్లింపునకు సొమ్ములు ఎవరైనా ఆశిస్తే జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఇదే సమయంలో కాంట్రాక్టర్లు సంబందిత అధికారులకు సొమ్ములు ఇచ్చేందుకు ప్రయత్నించిన నేరమేనని అటువంటి వాటి సమాచారం తెలిస్తే వారిపై కూడా చర్యలు తీసుకొంటామన్నారు. లేనిపోని కారణాలు చూపి బిల్లులు చెల్లింపులో జాప్యం చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొంటామన్నారు. ఈ విషయంలో పే అండ్ అకౌంట్స్ విభాగం కూడా ఆర్ అండ్ ఆర్ ఇళ్ల నిర్మాణ విషయంలో ఏ బిల్లు కూడా జాయింటు కలెక్టర్ వారి ఆమోదం లేకుండా వెనక్కి పంపేందుకు వీలు లేదన్నారు. ఆర్ అండ్ ఆర్ కింద నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి నాణ్యతతో ఉండడంతోపాటు పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులు జీవితాంతం నివసించే ఇళ్ల నిర్మాణంలో సంబందిత నిర్మాణ సామాగ్రి ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత లేమితో ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్మాణాల విషయంలో కాంట్రాక్టర్లకు ఎటువంటి ఆర్ధిక నష్టం జరిగే ప్రసక్తి లేదన్నారు. అదే విధంగా ప్రతీ వారం నిర్మాణాల ప్రగతి తీరును బట్టి ఏ వారంకు ఆ వారం బిల్లు చెల్లింపులు ఖచ్చితంగా జరుగుతాయన్నారు. ఈ విషయంలో ఏ స్థాయిలోనైనా, ఎటువంటి జాప్యం జరిగినా ప్రతీ శనివారం నిర్వహించే ఆర్ అండ్ ఆర్ సమావేశానికి కాంట్రాక్టర్లు తెలియజేయవచ్చన్నారు. ఏ వారంకావారం బిల్లులు చెల్లింపులు చేస్తే ఎటువంటి అవరోధాలు ఎదురవ్వవని అదే ఏక మొత్తంలో బిల్లులు పెడితే కొంత జాప్యం జరగవచ్చన్నారు. ఇకపై ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్, జంగారెడ్డిగూడెం ఆర్‌డివో తమకు నిర్ధేశించిన 19 కాలనీల్లో రానున్న 4 నెలల పాటు ప్రతినిత్యం ఏదో ఒక్క సమయంలో పర్యటించి ఇళ్ల నిర్మాణ తీరును, నాణ్యతను పరిశీలించాలన్నారు. ఈ విషయంలో వ్యక్తిగత శ్రద్ధ చూపాలని, కాలనీ సందర్శించే సమయంలో లబ్ధిదారులు వెలిబుచ్చే సమస్యలను అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లాలో గుంతలు పడిన ఆర్ అండ్ బి రోడ్లను మరామ్మత్తులు కోసం కేటాయించిన 30 కోట్ల రూపాయలతో పూర్తి నాణ్యతా ప్రమాణాలతో వాటిని మరామ్మత్తు చేయించాలని ఆర్ అండ్ బి ఎస్ ఇ నిర్మలను కలెక్టర్ ఆదేశించారు. రానున్న మంగళవవారం నుండి సంబంత రోడ్డు మరామ్మత్తు పనులను తాను స్వయంగా తనిఖీ చేస్తానని చెప్పారు. జిల్లాలో వివిధ ఆర్ అండ్ బి రహదార్ల అభివృద్ధికి చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులతో సంప్రదించి ఆ పనులు త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుండుగొలను నుండి కొవ్వూరు వరకూ గల జాతీయ రహదారి విస్తరణను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అద్వాన్నంగా వున్న రహదారిని మరామ్మత్తులు చేయకుండా ఉంచడం భావ్యం కాదన్నారు. తక్షణమే సంబందిత రహదారిని ప్రజా రవాణాకు అనువుగా మరామ్మత్తులు చేపట్టాలని ఎన్‌హెచ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కాలువులు కట్టే సమయానికి డెల్టా ఆధునిక పనులు చేపట్టేందుకు అవసరమైన నిర్మాణ సామాగ్రి కార్మికులను సిద్ధం చేసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. కాలువలు కట్టగానే సంబంధిత పనులు చురుకుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పోణంగి పుంతకు సంబంధించి మిగిలిన రెండు నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ మిగిలిన పనులు పూర్తి చేసే వరకూ సంబంధిత కాంట్రాక్టుకు బిల్లు చెల్లింపులు జరగవని దీనితోపాటు ఈ పనులు పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ నిర్లక్ష్య వైఖరికి వారి జీతాన్ని కూడా నిలుపుదల చేయాలని ఆదేశించారు. నల్లిక్రిక్, వియర్ ఛానల్, నక్కల్ డ్రైన్ పనులు జరుగుతున్న తీరును నరసాపురం ఇన్‌ఛార్జి ఆర్‌డివో పరిశీలించాలని ఆదేశించారు. పోగొండ ప్రాజెక్టు పనులు నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జల వనరుల శాఖ రఘునాధ్‌ను కలెక్టర్ ఆదేశించారే. చింతలపూడి ప్రాజెక్టు డిజైన్స్ అన్ని ఆమోదం పొందేలా సంబంధిత అధికారుల నుండి చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణ విషయంలో ఉద్యాన, ఇళ్లు తదితర ఆస్తుల విలువ లెక్కింపులో వ్యత్యాసాలు కనపడితే సంబందిత అధికారులపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేయడానికి వెనుకాడబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి, డి ఆర్‌వో ఎన్ సత్యనారాయణ, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్, ఐటిడి ఎ పివో హరీంధ్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.