పశ్చిమగోదావరి

కార్మికుల సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలపురం, డిసెంబర్ 8: రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శనివారం గోపాలపురంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి పితాని మాట్లాడుతూ వివిధ కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు ప్రమాదం వాటిల్లినప్పుడు వారికి బీమా సౌకర్యం కల్పించి ఆదుకుంటున్నామన్నారు. అలాగే ఎవరైనా ప్రమాదవశాత్తూ మృత్యువాత పడితే చంద్రన్న బీమా పథకం కింద వారికి సహాయం అందిస్తున్నామన్నారు. అవే కాకుండా కార్మిక చట్టం ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు సక్రమంగా అందజేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ ఎం సత్యనారాయణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్
ద్వారకాతిరుమల, డిసెంబర్ 8: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని తెలంగాణా రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎస్ రాజ సదరం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ ముఖ మండపంలో అర్చకులు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి వేదాశీస్సులు అందజేశారు. ఆ తర్వాత కమిషనర్‌కు ఆలయ ఏఈవో కర్రా శ్రీనివాసరావు శ్రీవారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంఘ నేత కూరాకుల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
సమాజంలో ఘంటసాల గేయాలకు శాశ్వతస్థానం: తోట
తణుకు, డిసెంబర్ 8: గాన గాంధర్వ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు అందించిన గేయాలు సమాజం ఉన్నంత వరకూ శాశ్వతంగా ఉంటాయని రాజ్యసభ సభ్యురాలు తోట సీతామహాలక్ష్మి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటుచేసిన ఘంటసాల విగ్రహాన్ని శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఎంపీ సీతామహాలక్ష్మి మాట్లాడుతూ నాటి తరం ప్రజలు ఘంటసాల గేయాలను ఆస్వాదించేవారన్నారు. ఇటువంటి మహా గాయకుడిని నిత్యం స్మరించుకునే విధంగా విగ్రహాన్ని నెలకొల్పటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విగ్రహ దాతలు వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతులను ఎంపీ సీతామహాలక్ష్మి ఘనంగా సత్కరించారు. తొలుత మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన 2కే రన్‌లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, ఘంటసాల విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఘంటసాల గీతాలను పట్టణంలోని గాయకులు చిప్పాడ నాగేశ్వరరావు, రాజు తమ మధుర గానంతో ఆలపించి శ్రోతలను రంజింపజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైటి రాజా, మున్సిపల్ ఛైర్మన్ పరిమి వెంకన్నబాబు, ‘ఘంటసాల ది గ్రేట్’ చిత్ర దర్శకుడు సిహెచ్ రామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జివి భాస్కర్, సినీ గేయ రచయిత రసరాజు తదితరులు పాల్గొన్నారు.
64వ జాతీయ అండర్-19
చపక్ తక్రా, చదరంగ పోటీలు ప్రారంభం
ఉంగుటూరు, డిసెంబర్ 8: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ఆచరించాలని, సమైక్యతా భావంతో మెలగాలని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు. శనివారం మండలంలోని నారాయణపురం బాపిరాజు స్టేడియంలో జాతీయ స్థాయి 64వ అండర్ 19 చపక్‌తక్రా, చదరంగం, అండర్ 14 చపక్‌తక్రా బాలికలు, బాలుర పోటీలను ఎమ్మెల్యే గన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో క్రీడాకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబునాయుడు క్రీడాకారులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రతి మండలానికి స్టేడియం నిర్మిస్తామని అన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు అధికంగా కేటాయించారన్నారు. దేశ సమైక్యతను కాపాడేందుకు క్రీడాకారులు దోహదపడాలన్నారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి సోమశేఖర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ప్రశాంతతకు, శారీరిక దారుఢ్యానికి దోహదపడతాయన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అసోసియేషన్ కార్యదర్శి, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆదిరెడ్డి సత్యనారాయణ నేతృత్వంలో జరుగుతున్న ఈ పోటీలలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. సమావేశంలో క్రీడా జ్యోతిని వెలిగించిన తరువాత క్రీడలను ప్రారంభిస్తున్నట్టు ఎమ్యెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా నరేష్ అనే విద్యార్థి కూచిపూడి నాట్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. కోస్తాలోనే పేరొందిన మోహన్ ఆర్కెస్ట్రాలో మోహన్ ఆలపించిన హిందీ సినీ పాటలు, అందుకుతగ్గ స్టెప్స్‌కు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు కూడా జతకలిపారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాణ్యం, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు కడియాల రవిశంకర్, పరిశీలకులు అమిత్‌కోహిలి, పాయల్ కోహిల్, కులదీప్ మీర, అండర్ 19 నిర్వాహక కార్యదర్శి ఐజాక్, ఎలిశెట్టి హరిబాబు, పొన్నం ప్రసాద్, ప్రభాకరరావు, గురువెల్లి రాజారావు, కర్రి రామారావు, అడపా శ్రీను, గుత్తా గాంధీ, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, సుధాకర్, ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో సీసీ కెమేరాలు
ఆకివీడు, డిసెంబర్ 8: మహిమాన్వితురాలు, ఆకివీడు గ్రామ దేవత శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. నాలుగురోజుల క్రితం ఆలయంలో జరిగిన చోరీ సంఘటనపై స్పందించిన అధికారులు ఈమేరకు నిర్ణయించారు. దీంతో ఆలయం చుట్టూ నిఘా పెంచేలా చర్యలు చేపట్టారు. శుక్రవారం ఆలయం చుట్టూ ఫోకస్ లైట్లు అమర్చారు. అంతేకాకుండా ఆలయంలో సీసీ కెమేరాలను అమర్చే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. సుమారు లక్ష రూపాయల వ్యయంతో వీటిని సమకూర్చారు. సీసీ కెమేరాల ఏర్పాటుకు అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు ఇల్లాపు అప్పారావు, సమయమంతుల బాబు, అరసవిల్లి రామచంద్రరావు, చేబ్రోలు అజయ్‌గౌడ్, దిలీప్‌తో పాటు అర్చకులు మొవ్వా ప్రభాకర్‌రావు, మొవ్వా రమణ, మొవ్వా చందు, మొవ్వా పట్ట్భారామయ్య ఆర్థిక సహకారాన్ని అందించారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం నిఘా పరిధిలోకి వచ్చాయి. ఆలయంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమేరాలు అమర్చే కార్యక్రమాన్ని ఆలయ మేనేజర్ ఆర్‌పిఆర్ కిషోర్, కిమిడి నాగరాజు, పొన్మమండ నర్సింహారావు తదితరులు పర్యవేక్షించారు.

ద్వారకాతిరుమలలో కార్తీక శోభ
ద్వారకాతిరుమల, డిసెంబర్ 8: గుండెల్లో భక్త్భివాన్ని నింపుకొని నిండు మనసుతో మహిళలు కార్తీక దీపాలను కోనేరులలో వదిలారు. కార్తీక మాస ముగింపును పురస్కరించుకుని శనివారం తెల్లవారుఝామునే మహిళలంతా కలిసి కోనేరుల వద్ద చేసిన సందడి పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో పలువురు మహిళలు కార్తీక దీపాలను విడిచారు. ముందుగా వీరు కార్తీక పుణ్యస్నానాలను ఆచరించి కోనేరు మెట్ల వద్ద పసుపు, కుంకుమలతో పోలి అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఆ తర్వాత అరటి డొప్పలను తెప్పలుగా చేసి అందులో కార్తీక దీపాలను వెలిగించి, వాటిని కోనేరుల్లో వదిలి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సారధ్యంలో ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
*ఏలూరు ఎమ్మెల్యే బడేటి
ఏలూరు, డిసెంబర్ 8: చంద్రబాబు సారధ్యంలో 2019 ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భవిస్తుందని, అందుకు ఇప్పటి నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధులు కావాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) పిలుపునిచ్చారు. పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బడేటి శ్రీహరిరావు ట్రస్టు కార్యక్రమాలపై శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన తండ్రి స్వర్గీయ బడేటి శ్రీహరిరావు పేరిట పేదల సంక్షేమానికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే రామారావు ఈ సందర్భంగా వెల్లడించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పేద మహిళకు కుట్టుమిషను అందిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 5 వేల మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసి వారి ఉపాధికి వీలు కల్పించినట్టు ఎమ్మెల్యే వివరించారు. వేసవిలో పాఠశాలలు తెరచే నాటికి స్కూల్ యూనిఫాంలు కుట్టుకునే అవకాశం వారికి కల్పిస్తామన్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చడమే గాకుండా చంద్రన్న బీమా, పెళ్లి కానుక, రంజాన్ తోఫా, సంక్రాంతి, క్రిస్మస్ కానుకలను పేదల కోసం 102 పథకాలను ప్రవేశపెట్టడమే గాకుండా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని బడేటి బుజ్జి పేర్కొన్నారు. సమాజంలో పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా చంద్రబాబు అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టారని, రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు పసుపు, కుంకుమ కింద రూ.10 వేలు ఇవ్వడమేగాకుండా రుణాలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నత చదువులు చదువుకోడానికి పేదరికం అడ్డు కాకూడదని పేద విద్యార్థినీ విద్యార్థులను గుర్తించి వారికి కావల్సిన ఫీజులను బడేటి శ్రీహరిరావు ట్రస్టు ద్వారా ఇప్పటివరకు రూ.5 కోట్లు వరకు అందించామని బుజ్జి తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులకు సొంత సొమ్ముతో వైద్యం చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.5 కోట్లు ఆర్థిక చేయూత అందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే బడేటి కోరారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు కొల్లేపల్లి రాజు, ఎఎంసీ ఛైర్మన్ పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న మోదీ
జిల్లా పరిషత్ ఛైర్మన్ ముళ్లపూడి
గోపాలపురం, డిసెంబర్ 8: ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రధాని మోదీ ఓర్వలేకపోతున్నారని జిల్లా పరిషత్ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. గోపాలపురం నియోజకవర్గ స్థాయి జయహో బీసీ కార్యక్రమం ఏఎంసీ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అందులో భాగంగానే రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలుపుదల చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం, అమరావతి నిర్మాణాలు జరగకుండా చేయాలన్నదే ప్రధాని ధ్యేయమన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో చాకచక్యంతో వ్యవహరిస్తూ అమరావతి, పోలవరంలను రెండు కళ్లుగా భావించి వాటి నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన జరిపిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ 16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌తో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ముఖ్యమంత్రి తన అనుభవాన్ని జోడించి దేశంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒకవైవు ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు వాటిని దిగ్విజయంగా కొనసాగించడం అభినందనీయమన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, రైతులకు సబ్సిడీపై విత్తనాలు, పనిముట్లు, యువతకు నిరుద్యోగ భృతి, స్వయం ఉపాధి రుణాలు వంటివి అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ రెండు కోట్ల ఎంపీ నిధులతో సంచార వైద్య వాహనాన్ని ఏర్పాటుచేశామన్నారు. ఈ వాహనం ద్వారా మారుమూల గ్రామాల్లోని మహిళలకు వైద్యపరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందన్నారు. బ్రెస్ట్ కేన్సర్, గర్భకోశ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన మహిళలు పడకుండా వారిని రక్షించడం జరుగుతుందన్నారు. అయితే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా, ఈ పథకం రాష్టవ్య్రాప్తంగా అమలయ్యేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు మురళీమోహన్ తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా బీసీ నాయకులు మంత్రి పితానికి గొర్రెపిల్లను బహూకరించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ఎం సత్యనారాయణతోపాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, బీసీ సెల్ అధ్యక్షులు, బీసీ నాయకులు పాల్గొన్నారు.

పొగబారిన రహదారి
వీరవాసరం, డిసెంబర్ 8: మండలంలోని నందమూరిగరువు పంచాయతీ పరిధిలో శనివారం పంచాయతీ సిబ్బంది చెత్తను తగలబెట్టడంతో జాతీయ రహదారి 165పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ రహదారికి ఆనుకుని రోడ్డు మార్జిన్‌లో గ్రామంలోని చెత్తను వేస్తున్నారు. ఆ చెత్త కాస్తా పెరిగిపోవటంతో దానిని దగ్ధం చేయటంతో దట్టమైన పొగ రహదారిపై కమ్ముకోవటంతో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలువురు ద్విచక్ర వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనమేదో తెలియక ప్రమాదాల భారిన పడ్డారు.