పశ్చిమగోదావరి

రసాభాసగా పడమర విప్పర్రు గ్రామదర్శిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 10: పెంటపాడు మండలం పడమర విప్పర్రులో సోమవారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమం రసాభాసగా మారింది. గ్రామదర్శిని కార్యక్రమం ప్రారంభించే సందర్భంలో రామచంద్రుడు అనే యువకుడు మాట్లాడటంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు అతనిని బయటకు తీసుకువెళ్లే ప్రయత్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు కలుగజేసుకుని మీ గ్రామానికి గౌరవం, మర్యాద లేదనడంతో కొంత మంది గ్రామస్తులు రభస చేశారు. దీనిపై మంత్రి అయ్యన్నపాత్రుడు గ్రామస్థుల తీరును నిరసిస్తూ సభనుంచి వెళ్లిపోయారు. నాయకులు ఎంత బతిమాలినా ఆయన నిరాకరించారు. టీడీపీ నేత సంపతరావు కృష్ణారావు స్థానిక నాయకుల తీరును నిరసిస్తూ మాట్లాడారు. ప్రధాన రహదారిలో నాయకులకు స్వాగతం పలికేందుకు ప్రజలు ఎదురుచూస్తుంటే వేరే మార్గంలో తీసుకువెళ్లారని నిరసన వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు నిష్క్రమణ అనంతరం జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ 10 రోజుల్లో పడమర విప్పర్రు ఆర్‌అండ్‌బీ రహదారి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు అనారోగ్యంతో ఉన్నా గ్రామదర్శినిలో పాల్గొని గ్రామ సమస్యలు తీర్చేందుకు విప్పర్రు వచ్చారన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి విప్పర్రు కంచుకోటగా ఉందన్నారు. గ్రామానికి సరైన రోడ్డు లేకపోతే ఎలా అని, మంత్రిని ఒప్పించి నిధులు ఇవ్వడానికి కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పసల చంటి, సొసైటీ అధ్యక్షుడు పసల అచ్యుతం, జడ్పీటీసీ కిలపర్తి వెంకట్రావు, ఎంపీపీ వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ దాసరి అప్పన్న, ఎంపీడీవో మల్లికార్జునరావు, తహసిల్దారు రమణ, ఏవో చీర్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

బీసీల సంక్షేమ బాధ్యత ప్రభుత్వానిదే:మంత్రి పితాని
తాడేపల్లిగూడెం, డిసెంబర్ 10: తెలుగుదేశం పార్టీని అభిమానించే బీసీల సంక్షేమ బాధ్యత ప్రభుత్వానిదేనని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డులో జయహో బీసీ సన్నాహాక సభ నియోజకవర్గ సమన్వయకర్త ఈలి నాని అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీసీలకు పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇటీవల మంజూరు చేసిన సబ్సిడీ రుణాల్లో బీసీలకు సరైన న్యాయం జరగలేదనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కార్పొరేట్ వ్యవస్థల రాకతో కులవృత్తులు దెబ్బతిన్నాయన్నారు. కుల వృత్తిని నమ్ముకున్న బీసీలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎస్సీలకు భారత రాజ్యాంగం ద్వారా చట్టసభల్లో ఎన్నికయ్యే అవకాశాన్ని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కల్పించగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత అన్న ఎన్టీ ఆర్‌దేనన్నారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవిని బీసీలకు ఇచ్చేందకు కృషిచేస్తామన్నారు. రాష్ట్ర ఖాదీ బోర్డు ఛైర్మన్ దొమ్మేటి సుధాకర్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడంతో ఎంతోమంది సర్పంచ్‌లు జడ్పీ ఛైర్మన్లుగా పదవులు చేపట్టారన్నారు. బలహీన వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యకోసం రూ. 10 లక్షలు స్కాలర్‌షిప్ అందిస్తున్నామన్నారు. నియోజకవర్గం నుండి 10 వేల మంది తక్కువకాకుండా బీసీ సదస్సుకు హాజరయ్యేలా చూడాలన్నారు. మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి పూర్తయి ఏడాది గడిచినా భర్తీచేయకపోవడంతో బీసీల్లో అసంతృప్తి ఉందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌ఛైర్మన్ కిలాడి ప్రసాద్, మాజీ వైస్‌ఛైర్మన్ గొర్రెల శ్రీ్ధర్, పెంటపాడు జడ్పీటీసీ కిలపర్తి వెంకట్రావు, టీడీపీ నాయకులు సంపతరావు కృష్ణారావు, కోరశిఖ మునేశ్వరరావు, పాశం బుల్లివెంకట రమణ, కౌన్సిలర్లు పెంటా రాజేశ్వరి, కాకర్ల సుభద్ర తదితరులు పాల్గొన్నారు.