పశ్చిమగోదావరి

కోర్టు కేసుల పరిష్కారానికి అధికారులకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 10: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి సంబంధించి స్పీకింగ్ ఆర్డర్స్, కౌంటర్ అఫిడవిట్ రాయడంలో జిల్లా అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల్లో ఉన్న కోర్టు కేసులకు సంబంధించి అధికారులు సక్రమంగా కౌంటర్ ఫైల్ దాఖలు చేయకపోవడం, స్పీకింగ్ ఆర్డర్స్ రాయకపోవడం వలన కోర్టులో ఎక్కువ కేసులు వీగిపోతున్నాయని అన్నారు. అధికారులు కేసుకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని, కేసు నెగ్గేందుకు అవసరమైన పూర్తి వివరాలను స్పీకింగ్ ఆర్డర్స్ సక్రమంగా రాయాలన్నారు. సకాలంలో కౌంటర్ దాఖలు చేసి సత్వరమే కేసులు పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చాలా మంది జిల్లా అధికారుల్లో స్పీకింగ్ ఆర్డర్స్, కౌంటర్ ఫైల్ దాఖలు చేయడం సక్రమంగా లేకపోవడం వల్ల ఈ నెల 16వ తేదీ ఆదివారం జిల్లా అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్టు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో వివిధ శాఖల్లో 119 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మీకోసం కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయిలో 5, క్షేత్రస్థాయిలో 67 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఎఎంఎస్ సంబంధించి జిల్లా స్థాయిలో 150 కేసులు క్షేత్రస్థాయిలో 330 దరఖాస్తులు ఉన్నాయని, వాటిని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనల మేరకు కచ్ఛితంగా సకాలంలో కార్యాలయాలకు వచ్చి బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. ఆలస్యంగా వచ్చినా, కార్యాలయం నుండి ముందుగా వెళ్లిపోయినా, సాయంత్రం హాజరు ముగియకుండా వెళ్లిపోయినా ఆ రోజు సెలవుగా పరిగణించి వారి సెలవు ఖాతా నుండి తగ్గించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారికి న్యాయయమైన సేవలు అందించాలని కలెక్టర్ చెప్పారు. తాను ఎన్నిసార్లు హెచ్చరించినా కొంతమంది ఉద్యోగులు తాము పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాల నుండి వస్తున్నారని, దాని వల్ల సకాలంలో కార్యాలయాలకు హాజరు కాలేకపోతున్నారని, దాంతో ప్రజలకు సేవలందడం లేదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా సకాలంలో పూర్తి కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు జవాబుదారీతనంగా ఉండాలని, చిత్తశుద్ధితో తమ విధులు నిర్వర్తించాలని కలెక్టర్ కాటంనేని చెప్పారు. కార్యక్రమంలో జెసి ఎం వేణుగోపాలరెడ్డి, ఆర్డీవో ఎన్ సత్యనారాయణ, డ్వామా పిడి ఎం వెంకటరమణ, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ శంకరరావు, డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, సమాచార శాఖ ఎడి కె సుభాషిణి, డిఆర్‌డిఎ పిడి శ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు, డీఈవో రేణుక, మత్స్యశాఖ జెడి డాక్టర్ అంజలి, ఐసిడిఎస్ పిడి విజయలక్ష్మి, సెట్‌వెల్ సీఈవో సుబ్బిరెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.