పశ్చిమగోదావరి

భీమవరం, బంటుమిల్లి ప్రాంతాల్లో ఆయిల్ నిక్షేపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, డిసెంబర్ 12: ఓఎన్జీసీ కేజీ బేసిన్ పరిధిలోని భీమవరం, బంటుమిల్లి ప్రాంతాల్లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను గుర్తించినట్టు ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రాజమండ్రి అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ వెల్లడించారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ కృష్ణాజిల్లా బంటుమిల్లి ప్రాంతంలో అపారమైన గ్యాస్ నిక్షేపాలు వెలికితీసామని, ప్రస్తుతం ఒక బావి నుండి గ్యాస్ తీస్తున్నామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మరో రెండు బావుల నుండి గ్యాస్ వెలికితీసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే కేజీ బేసిన్ పరిధిలో గత ఏడాది 38 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ వెలికి తీసామని, ఇది కేజీ బేసిన్ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు అని ఆయన తెలిపారు. అలాగే కేజీ బేసిన్ నుంచి రోజుకి 900 టన్నుల ముడి చమురు లభిస్తోందని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు దీనిని 1200 నుండి 1400 టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అదేవిధంగా ఉత్పత్తి, భద్రత, స్వచ్ఛ్భారత్ నిర్వహణలో రాజమండ్రి విభాగం ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. దీనికి గుర్తింపుగా త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగిస్తున్న ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల్లో సేవా కార్యక్రమాల నిర్వహణకు ఈ ఏడాది రూ.40 కోట్లు ఖర్చు చేసామన్నారు. మూడు జిల్లాల నుంచి మరో రూ.20 కోట్ల వ్యయం కాగల ప్రతిపాదనలు అందాయని, వీటిని పరిశీలించి నిధులు మంజూరు చేస్తామని అసెట్ మేనేజర్ శేఖర్ తెలిపారు. కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల సాయి, ఆప్కాబ్ చైర్మన్ అండ్రాజు చల్లారావు తదితరులు పాల్గొన్నారు.

ఓఎన్జీసీ ఆధ్వర్యంలో స్వచ్ఛ్ధార, సోలార్ మరుగుదొడ్లు
నరసాపురం, డిసెంబర్ 12; ఓఎన్జీసీ సామాజిక సేవాకార్యక్రమంలో భాగంగా నరసాపురం పట్టణం, రూరల్ గ్రామాల్లో మూడు మంచినీటి ఏటిఎం, రెండు స్వచ్ సోలార్ మరుగుదొడ్లను ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రాజమండ్రి అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ బుధవారం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాలతో కలిసి ప్రారంభించారు. పట్టణంలోని కోవెల వీధి, ప్రభుత్వాసుపత్రి వద్ద రూ.40 లక్షల వ్యయంతో స్వచ్ సోలార్ మరుగుదొడ్లు, మండలంలోని బియ్యపుతిప్ప, లిఖితపూడి గ్రామాల్లో ధర రహిత మంచినీటి ఏటిఎంలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ ఓఎన్జీసీ కార్యనిర్వాహక ప్రాంతాల్లో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా హైటెక్ టాయిలెట్స్ నరసాపురం పట్టణంలో ఏర్పాటు చేసామన్నారు. అంతేకాక విద్య, వైద్య సేవలు, గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు తమవంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం సరిపల్లి గ్రామంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాతాడి కనకరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నాల నాగబాబు, ఆప్కాబ్ చైర్మన్ అండ్రాజు చల్లారావు, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొత్తూరి రామరాజు, కౌన్సిలర్లు బళ్ళ వెంకటేశ్వరరావు, గోరు సత్తిబాబు, వనె్నంరెడ్డి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ సదస్సుకు మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి
నరసాపురం, డిసెంబర్ 12: ఈ నెల 14,15 తేదీల్లో కోల్‌కటాలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి పాల్గొననున్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బాలల భద్రత హక్కుల కమీషన్, మహిళా అభివృద్ధి సంక్షేమ కమీషన్, ఐటి శాఖ నుండి ఆమెకు ఆహ్వానం లభించింది. బాలలపై లైంగిన దోపిడి అనే అంశంపై నిర్వహించే ఈ సదుస్సులో డాక్టర్ రాజ్యలక్ష్మి ప్రసంగిస్తారు. బాలలపై లైంగిక దోపిడిని నిరోధించాలనే లక్ష్యంతో మహిళా కమీషన్, మేధావులు, ఎన్జీవోలు, న్యాయవాదులు, మీడియా ఆలోచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు డాక్టర్ రాజ్యలక్ష్మి చెప్పారు.

మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి
మొగల్తూరు, డిసెంబర్ 12: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మొగల్తూరు మత్స్యశాఖ అధికారి కొత్త రమణకుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 16 వరకు అల్పపీడన ప్రభావం ఉంటుందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందన్నారు. సముద్ర తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆయన సూచించారు. అల్ప పీడన ప్రభావం వల్ల గంటకు 70 నుండి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.