పశ్చిమగోదావరి

రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీయడానికి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, జనవరి 8: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిలను అడ్డుపెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర పన్నారని నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆరోపించారు. మంగళవారం మండలంలోని పసలదీవి గ్రామంలో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాల్సిన ప్రధాని మోదీ ఆంధ్ర రాష్ట్రంపై కక్షగట్టారని విమర్శించారు. అంతేకాక పొరుగు రాష్టమ్రైన తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డిలను అడ్డుపట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. అలాగే తనపై ఉన్న లక్ష కోట్ల దోపిడీ కేసులను మాఫీ చేసుకునేందుకు జగన్ ప్రధాని మోదీ డైరెక్షన్‌లో నటిస్తున్నారన్నారు. అంతేకాక రాష్ట్భ్రావృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవనాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.2.41 కోట్ల వ్యయంతో నిర్మించిన తుపాను రక్షిత భవనం, రూ.13 లక్షల వ్యయంతో నిర్మించిన డ్వాక్రా భవనం, రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన పంచాయతీ భవనం, రూ.18.20 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్‌వాడీ భవనం, రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సిమెంటు రహదారులను ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాతాడి కనకరాజు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి, డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పొత్తూరి రామరాజు, ఏఎంసీ ఛైర్మన్ కొప్పాడి రవి తదితరులు పాల్గొన్నారు.

హరికిశోర్‌కు నిమ్మల పరామర్శ
యలమంచిలి, జనవరి 8: యలమంచిలిలో గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఎంపీపీ బొమ్మన సుజాత భర్త హరికిశోర్‌ను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ సభ్యుడు బోణం నాని, చిట్టూరి సీతారామాంజనేయులు, ఎం ఫకీరుబాబు, కె మణి, కె గోపాలరావు తదితరులున్నారు.