పశ్చిమగోదావరి

రూ.430 కోట్లతో చంద్రన్న సంక్రాంతి కానుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 8: రాష్ట్రంలోని పేదలకు రూ.430 కోట్లతో చంద్రన్న సంక్రాంతి కానుకలను అందిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు శ్రీనివాసరావు చెప్పారు. ఏలూరు మండలం గుడివాకలంక, ప్రత్తికోళ్లలంక గ్రామాలలోని చౌకధరల దుకాణాల్లో చంద్రన్న కానుకల పంపిణీని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలు సంక్రాంతి పండుగను సంతోషంగా చేసుకునేందుకు తెల్ల కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి రూ.250 విలువైన 6 రకాల నిత్యావసర సరకులను ఉచితంగా అందిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా చంద్రన్న సంక్రాంతి కానుక కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. కందిపప్పు, శనగపప్పు, పంచదార, నెయ్యి, నూనె, బెల్ల చంద్రన్న కానుకగా అందిస్తున్నట్టు వివరించారు. ఎక్కడైనా నాణ్యత తక్కువ కలిగిన వస్తువులు సరఫరా అయితే వెంటనే సంబంధిత డీలరుకు వాసపు ఇచ్చి మంచి సరకు తీసుకోవాలని సూచించారు. రేషన్ బియ్యాన్ని బ్లాక్‌మార్కెటింగ్ చేస్తే సంబంధిత కార్డుదారుడు, డీలరు, కొన్న వారిపై కేసులు నమోదు చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. అనంతరం ప్రత్తికోళ్లలంకలో 114 నంబరు రేషన్ దుకాణాన్ని ఆయన తనిఖీ చేశారు. కార్యక్రమంలో సహాయ పౌరసరఫరాల అధికారి మోహనబాబు, డిప్యూటీ తహసీల్దారు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అగ్రవర్ణ పేదలకు వరం ఈబీసీ రిజర్వేషన్లు
*మాజీ మంత్రి మాణిక్యాలరావు
తాడేపల్లిగూడెం, జనవరి 8: అగ్రవర్ణ పేదలకు ఈబీసీ రిజర్వేషన్లు వరప్రదాయిని అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మాణిక్యాలరావు అన్నారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు దశాబ్దాల కాలంలో ఏ ప్రభుత్వం తీసుకోని గొప్ప నిర్ణయాన్ని నరేంద్ర మోదీ తీసుకున్నారన్నారు. అందరి సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పటేల్, జాట్‌లు, పాటేదార్లు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు చేస్తున్న వారందరికీ ఈ రిజర్వేషన్లు ఉపయోగమన్నారు. ఏపీలో బ్రాహ్మణ, వైశ్య, కాపు, కమ్మ, రెడ్డి, వెలమ వంటి అగ్రకులాలకు ఈబీసీ రిజర్వేషన్ల కల్పన గొప్ప ఉపశమనమన్నారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు ఫలితాలు నేడు ప్రజలకు అందుతున్నాయన్నారు. పప్పులు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా తగ్గి సామాన్యులకు ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పోతుల అన్నవరం, యెగ్గిన నాగబాబు, ఈతకోట తాతాజీ, నరిశే సోమేశ్వరరావు, పుల్లభొట్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.