పశ్చిమగోదావరి

వ్యవసాయాభివృద్ధిలో దేశంలో నాలుగో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుమంట్ర, జనవరి 8: నెగ్గిపూడి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న విత్తన, భూసార పరీక్షా ప్రయోగశాల భవన పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కార్మిక, ఉపాధి కల్పనా శాఖా మంత్రి పితాని సత్యనారాయణ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల లోటు బట్జెట్ ఉన్నప్పటికీ ఎంతో అభివృద్ధి సాధించామని, ఇంకా సాధించాలన్నారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రం 11.08 శాతం వృద్ధిరేటు సాధించి దేశంలో నాల్గవ స్థానంలో నిలిచినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరిసాగులో యాంత్రీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అందించే దిశగా ఆలోచన చేయడమేగాక ఆచరణలో పెట్టడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో రైతులకు మరింత నాణ్యమైన విత్తనాలను అందించడానికి, భూసార పరీక్షలు ముమ్మరం చేసి రైతులకు తగిన సూచనలు, సలహాలు అందించడం ద్వారా అధిక దిగుబడి సాధించే కృషి జరుగుతోందన్నారు. వంగడాల రూపకల్పనలోనే కాకుండా వరిసాగులో రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధిగమించడానికి అవసరమైన పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానం అందించి అధిక దిగుబడి సాధించే దిశగా పరిశోధనా సంస్థ పయనిస్తుందని ఆకాంక్షించారు. పోలవరం రికార్డు స్థాయిలో పూర్తిచేసి గిన్నిస్ రికార్డును సైతం నమోదు చేసుకున్నట్టు మంత్రి తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు నీరు అందించి పంటలు పండించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వానిదేనని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిని చూడకుండా కేవలం పదవే లక్ష్యంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఆరోపణలు చేయడం తగదని జగన్‌కు ఈ సందర్భంగా మంత్రి హితవు పలికారు. మార్టేరు వరి పరిశోధనా స్థానం విడుదల చేసిన వరి విత్తనాలు జాతీయ స్థాయిలో 25 శాతం, రాష్టస్థ్రాయిలో 80 శాతం రైతులు వినియోగించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పితాని మాట్లాడుతూ ఇందిరా క్రాంతి పథకం, డ్వాక్రా గూపుల ద్వారా, సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలుకు గతంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారని, అయితే ఇప్పుడు ఆన్‌లైన్ సదుపాయాలు, పూర్తి స్వచ్ఛా కలిగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కృషికి అధికారులు పూర్తి సహకారం అందించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో డీఆర్ ఎన్‌వినాయుడు, పాలకమండలి సభ్యుడు డాక్టర్ జివి నాగేశ్వరరావు, ఏడీఆర్ పాటూరి మునిరత్నం, వ్యవసాయ శాఖ జేడీ బేగం, ఏడీఏ మురళీకృష్ణ, తహసీల్దారు పి శ్రీనివాసరావు, నర్సాపురం డీఎస్పీ ప్రభాకర్‌బాబు, జడ్పీటీసీ సత్యసాయి, ఆదినారాయణరెడ్డి, ఆదర్శ రైతు నెక్కంటి సుబ్బారావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాయుడు విజయ్‌కుమార్, వ్యవసాయాధికారులు, శాస్తవ్రేత్తలు కె వెంకటరెడ్డి, మానుకొండ శ్రీనివాస్, బోధనేతర సిబ్బంది, వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థినీ విద్యార్థులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.