పశ్చిమగోదావరి

చంద్రబాబు హయాంలో నిరంతర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు, ఫిబ్రవరి 7: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తరువాత కోత లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో రూ.84 కోట్ల 25 లక్షలతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని, వరదాలపాలెం నుండి దువ్వ వరకు రూ.7 కోట్ల 65 లక్షలతో చేసిన అభివృద్ధిని ఆయన ప్రారంభించి, అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ముఖ్యమంత్రి కృషితో దానిని అధిగమించి అన్ని రంగాల్లో ముందుండేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ సదుపాయం సమృద్ధిగా ప్రజలకు అందే విధంగా ప్రయత్నిస్తున్నట్టు వెంకట్రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణారావు, ఖాదీ గ్రామీణ బోర్డు ఛైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తణుకు మున్సిపల్ ఛైర్మన్ పరిమి వెంకన్నబాబు, జడ్పీటీసీ ఆత్మకూరి బులిదొరరాజు, మాజీ జడ్పీటీసీ కట్టా సూర్యారావు, ఎంపీపీ కట్టా అనంతలక్ష్మి, వైస్-ఎంపీపీ వల్లూరి రామ్మోహన్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ బసవా రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పితాని మోహనరావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు గిద్దా ధనరాజు తదితరులు పాల్గొన్నారు.
పురపాలక సంఘంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
ఇదిలావుండగా తణుకు పురపాలక సంఘ పరిధిలోని 7వ వార్డులో రూ.4 కోట్ల 50 లక్షలతో నిర్మించిన యలమర్తి నారాయణరావు చౌదరి పురపాలక రవాణా వాణిజ్య సదుపాయాన్ని కూడా మంత్రి కళా వెంకట్రావు ప్రారంభించారు. అలాగే రాష్టప్రతి రోడ్డులో యువి పాల్‌బ్రిడ్జి నుండి ఎంట్రెన్స్ ఆర్చి వరకు రూ.35 లక్షల 50 వేలతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే రూ.4 కోట్లతో అభివృద్ధి చేసిన వేల్పూరు రోడ్డు డ్రైనేజీలను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. భాష్యం స్కూలుకు ఎదురుగా రూ.కోటి 79 లక్షలతో నిర్మించిన విద్యుత్, రెవెన్యూ సబ్‌డివిజన్ సెక్షన్ కార్యాలయాల భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ నియోజకవర్గాన్ని ప్రగతి బాటలో ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పరిమి వెంకన్నబాబు, వైస్-్ఛర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, ఏఎంసీ ఛైర్మన్ తోట సూర్యనారాయణ, తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, తెలుగు యువత అధ్యక్షుడు ఒంటెద్దు రాజా, కౌన్సిలర్ వావిలాల సరళాదేవి, మున్సిపల్ కమిషనర్ గోరంట్ల సాంబశివరావు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య రాకుండా గ్రామాల వారీగా
ప్రతీ నియోజకవర్గానికి రూ.1500 కోట్లు ఇచ్చిన కేంద్రం
*జిల్లా ఉపాధ్యక్షుడు అల్లూరి
భీమవరం, ఫిబ్రవరి 7: జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం సుమారు రూ.1500 కోట్లు ఇచ్చిందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లూరి సాయిదుర్గరాజు పేర్కొన్నారు. ఆ నిధులతోనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాయన్నారు. గురువారం ఎంపీ గోకరాజు గంగరాజు కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదాహరణకు రైల్వే డబ్లింగ్, సౌర విద్యుత్, విద్యుత్ సబ్ స్టేషన్, పాస్‌పోర్టు కార్యాలయం, భీమవరం బైపాస్, రూ.100 కోట్లకు పైగానే అమృత్, హౌసింగ్ ఫర్ ఆల్..ఇలా అనేక కార్యక్రమాలు చేశారని, తాము కేవలం కొన్ని విషయాలు గురించే చెబుతున్నామని అంతకన్నా ఎక్కువగా అభివృద్ధి చేసినట్టు చెప్పారు. నియోజకవర్గంలోని సుమారు 60వేల మంది కుటుంబాలు భారత ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన 120కి పైగా సంక్షేమ పథకాల్లో భాగస్వాములయ్యారని, కావాలంటే ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రభారి దొమ్మరాజు సునీల్ మాట్లాడుతూ అమిత్ షా నాయకత్వంలో మోదీ ప్రభుత్వంలో ప్రజలకు భరోసా, కుటుంబాలకు, ప్రతీ గ్రామం, నగరం అభివృద్ధి చెందేలా, పౌరుడి కోసం వౌలిక సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు. మండల ప్రధాన కార్యదర్శులు రాట్లా సత్యనారాయణ, సోము సత్యనారాయణ, వోబీసీ ఉపాధ్యక్షుడు తిరుమాని వెంకటేశ్వరరావు, ఆలమూరి మల్లికార్జునరావు, దండు సోమరాజు, షేక్ చాన్‌భాషా, దంపబోయిన కుమారస్వామి, జోనల్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి అద్దెపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.