పశ్చిమగోదావరి

ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోనే విద్యాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదవేగి, ఫిబ్రవరి 7: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోనే విద్యాభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ విషయంలో దాతల సహకారం ఎనలేనిదని డీఈవో సివి రేణుక అన్నారు. పెదవేగి మండలం కవ్వగుంట గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను డీఈవో సివి రేణుక సత్కరించారు. పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణానికి ఓఎన్జీసీ రూ.4 లక్షలు సమకూర్చింది. అలాగే పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన బల్లలు, బ్యాగ్‌లు, పుస్తకాలు, క్రీడా వస్తువులను కెనరా బ్యాంకు అందజేసింది. పలువురు దాతలు పాఠశాల అభివృద్ధికి సహకరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఓఎన్జీసీ జీఎం బి సతీష్ కుమార్, కెనరా బ్యాంకు మేనేజర్ టి నరేంద్రరెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ దంపతులు సుగసాని లక్ష్మీకాంతం, గంగాధరరావులను డీఈవో శాలువాకప్పి సత్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతోందన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం కావాలంటే దాతల సహకారం అవసరమని, ప్రతి గ్రామంలో దాతలు ముందుకువచ్చి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో సిహెచ్ బుధవాసు, ఎస్‌ఎస్‌ఏ సీఎంవో రూజ్‌వెల్ట్, ఏఎల్‌ఎస్ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు, పీఆర్టీయూ అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, పాఠశాల హెచ్‌ఎం పి సత్యవతి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.