పశ్చిమగోదావరి

ఉగ్రదాడి కి నిరసనగా విద్యార్థుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, ఫిబ్రవరి 18: కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ సోమవారం గౌతమి విద్యా సంస్ధలు ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాయపేటలో ప్రారంభమైన ఈ ర్యాలీ మొగల్తూరు రోడ్డు, అంబేద్కర్ సెంటర్, మెయిన్ రోడ్డు, పాత బజార్ మీదుగా సాగింది. ర్యాలీని ప్రారంభించిన నరసాపురం శాసన సభ్యులు బండారు మాధవనాయుడు మాట్లాడుతూ భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. అంతేకాక భారత సైన్యానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని ఎమ్మెల్యే మాధవనాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమి కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రామచంద్ర రావు, సూపరిండెంట్ గఫార్‌ఖాన్, సత్తిబాబు, జి.శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. వై.ఎన్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ రావు, ఉపాధ్యక్షులు జివికె రామారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కర్ణా వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ ఎస్‌ఎం మహేశ్వరి, ఎన్‌ఎస్‌ఎస్ కన్వీనర్ డాక్టర్ ఎం నాగేశ్వర రావు పాల్గొన్నారు.
శ్రీ పెద్దింట్లమ్మ, శ్రీవనువులమ్మ అమ్మవార్ల హుండీల లెక్కింపు
ఆకివీడు, ఫిబ్రవరి 18: ఆకివీడులోని శ్రీ పెద్దింట్లమ్మ, శ్రీవనువులమ్మ అమ్మవార్ల దేవాలయాల్లో హుండీలను సోమవారం లెక్కించారు. పెద్దింట్లమ్మ హుండీలో నాలుగు నెలలకుగాను రూ.73,871లు కానుకలు వేసారన్నారు. ఆరుగ్రాముల బంగారు ఉంగరం హుండీలో వేసినట్లు ఆలయ మేనేజర్ ఆర్‌పిఆర్ కిషోర్ తెలిపారు. అలాగే వనువులమ్మ అమ్మవారి ఆలయహుండీలో నాలుగు నెలలకు గాను రూ.24,074 ఆదాయం వచ్చిందన్నారు. హుండీ లెక్కింపులో ఇల్లాపు చినఅప్పారావు, సమయమంతుల బాబు, జంగారెడ్డి కొండారెడ్డి, అరసవల్లి రామచంద్రరావు, పొన్నమండ నర్సింహారావులు పాల్గొన్నారు. శృంగవృక్షం దేవాలయాల మేనేజర్ కమ్మిల భాస్కరరావు ప్రత్యేక తనిఖీ అధికారిగా పాల్గొన్నారు.
భీమవరంలో గురువులు భిక్షాటన
భీమవరం, ఫిబ్రవరి 18: భీమవరంలోని గురువులు రోడ్డెక్కారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని ఎయిడెడ్ కళాశాలల్లో తాత్కాలిక అధ్యాపకులుగా పనిచేస్తున్న వారు భిక్షాటన చేశారు. సోమవారం స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ నుంచి ఈ వినూత్న ఆందోళన చేపట్టారు. వీరికి విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. గురువులు ఈ విధంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం చూసి చాలా మంది చలించిపోయారు. ఎంతో మందికి సహాయం చేస్తున్న ప్రభుత్వం గురువులకు కూడా ఏదైనా చేస్తే బాగుండేదని పలువురు విద్యార్థులు, ప్రజలు అభిప్రాయపడ్డారు.