పశ్చిమగోదావరి

గిరిజనుల ధర్నా, ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, ఫిబ్రవరి 18: గిరిజనులు సాగు చేస్తున్న పోడుభూములకు, 1/70చట్ట భూములకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ధర్నా, ప్రదర్శన నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో పోడుభూములు సాగుచేస్తున్న గిరిజన రైతులు చేసిన ధర్నా కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ పోడుభూముల రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలుచేసి రూ.15వేల పెట్టుబడి సహాయం అందించాలని కోరారు. సుమారు 10వేల ఎకరాల పోడుభూములను గత మూడు దశాబ్దాలుగా గిరిజనులు సాగుచేస్తున్నారని తెలిపారు. ఈ భూములపై హక్కులు కల్పించి, ప్రభుత్వ రికార్డుల్లో తమ పేర్లుమీద నమోదుచేయాలని అనేకసార్లు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం పట్టాలివ్వకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు అందుగుల ఫ్రాన్సిస్ మాట్లాడుతూ గిరిజన పోడురైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపచేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి పార్టీనేతలు పోలోజు నాగేశ్వరరావు, వెట్టి వీరయ్య, సుండ్రు బుల్లెమ్మ, మడకం వీరాయమ్మ, ఉనుముల సూర్యచంద్రం, తదితరులు నాయకత్వం వహించారు.
ఉగ్రవాదుల దాడి హేయకరం
* ఏపీ నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు
తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 18:్భరత జవాన్లపై ఉగ్రవాదుల దాడి హేయకరమని ఏపీ నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు అన్నారు. పుల్వామా ఘటనలో మృతి చెందిన భారత జవాన్లకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ సోమవారం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు మాట్లాడుతూ త్వరలోనే ఉగ్రవాదులకు భారత జవాన్లు సరైన సమాధానం చెబుతారన్నారు. భారత ప్రభుత్వం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిఆర్‌కె ఆచార్యులు, రిజిస్ట్రార్ అంబాప్రసాద్, డీన్ జీఆర్‌కె శాస్ర్తీ, ఓఎస్‌డీ రేవతి, డాక్టర్ వీరేష్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎదురెదురుగా లారీలు ఢీ
-తృటిలో తప్పిన ప్రమాదం
పోలవరం, ఫిబ్రవరి 18: పోలవరం మండలం పట్టిసం గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. పోలవరం ప్రాజెక్టుకు సిమెంటు తీసుకొస్తున్న బల్కర్, అలాగే పోలవరం నుండి తాళ్లపూడి వైపు ఇసుక లోడుతో వెడుతున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇసుక లారీ వస్తున్నా బల్కర్ పక్కకు తప్పుకోకపోవడంతో గమనించిన ఇసుక లారీ డ్రైవరు ఎడమ వైపు గట్టు ఎక్కించడంతో ఎదురెదురుగా ఢీకొనబోయిన లారీలు రెండూ పక్కపక్కన ఢీకొని ఆగిపోయాయి. దాంతో రెండు లారీలు దెబ్బతిన్నాయే తప్ప డ్రైవర్లకు గాయాలేమీ కాలేదు. ప్రమాదం అనంతరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న బస్సులు, ఇతర వాహనాలు సుమారు అయిదు గంటలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలవరం ఎస్సై రామచంద్రరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాజెక్టు నుండి భారీ క్రేనును రప్పించి రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిన సిమెంటు బల్కర్‌ను పక్కకు పెట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.