పశ్చిమగోదావరి

ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలపై చర్యలేవీ: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 18: ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడమే గాకుండా వాటిలో నిర్మాణాలు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ప్రశ్నించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. తాడేపల్లిగూడెం నుండి అల్లు దొరబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తూ తాడేపల్లిగూడెం మున్సిపాల్టీ పరిధిలోని 33వ వార్డులో ఒక వ్యక్తి ప్రభుత్వ స్థలం ఆక్రమించి, అక్రమ నిర్మాణం చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మీకోసంలో అందిన దరఖాస్తులపై సమగ్ర వాచారణ జరిపి త్వరతగతిన పరిష్కరించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా సంబంధిత అధికారులు సత్వరం చర్యలు చేపట్టాలన్నారు. మీకోసంలో అందిన దరఖాస్తులు పరిష్కారంలో ఎటువంటి జాప్యం లేకుండా ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఏ శాఖలో ఎన్ని దరఖాస్తులు వచ్చినవి, వాటిలో పరిష్కరించకుండా ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నది, నిర్దేశించిన గడువు తీరినప్పటికీ పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులపై కారణాలు తెలపాలన్నారు. ప్రతి శనివారం లోగా సంబంధిత శాఖల అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులపై క్షేస్థ్రాయిలో సమీక్షలు నిర్వహించి, వాటిని పరిష్కరించాలని సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలో నివేదిక సమర్పించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ, ఎన్నికల నిర్వహణ పనులు సమాంతరంగా జరగాలన్నారు. వీటి నిర్వహణలో ఎటువంటి లోపం జరగకుండా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఆయా శాఖాధికారులకు నిర్దేశించిన పనులు కూడా తూచా తప్పకుండా త్వరితగతిన అమలు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలెక్టరేట్ నుండి ఏ స్థాయిలో ఆదేశాలు వచ్చినా వాటిని సత్వరం నిర్వహించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీకోసంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన రజకులు అంతర్వేది విఘ్నేశ్వరరావు, జిల్లా రజక సేవా సంఘం అధ్యక్షుడు కెల్లి సింహాచలం, మరికొంతమంది ఫిర్యాదు సమర్పిస్తూ రజకులకు కేటాయించిన చెరువు గట్లపై ఉన్న కొబ్బరి చెట్ల పాట రజకుల సంక్షేమానికి పరిమితమని తహసీల్దారు ఇచ్చిన ఎండార్స్‌మెంట్ లెక్కచేయకుండా తమ సంఘం సభ్యులు లేకుండా ఈ నెల 14న పంచాయతీ అధికారునలు పాట నిర్వహించి ఇతరులకు కేటాయించారని చెప్పారు. లింగపాలెం మండలంలోని కలరాయనిగూడెం, బోగోలు గ్రామ పంచాయతీకి చెందిన రైతులు బివిఎస్ స్వామి, శివరామకృష్ణ, యర్రా విష్ణుమూర్తి మరికొంతమంది ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ద్వారా వినతిపత్రం సమర్పిస్తూ గ్రామంలో 60 మంది రైతులు 320 ఎకరాల్లో బిస్పోసీడ్ మొక్కజొన్న సాగు చేశారని, అయితే దిగుబడి రాకపోవడం వల్ల బిస్పో సీడ్స్ కంపెనీ వారిని ఆ సంస్థ ఏజెంటు వారిని ప్రశ్నించగా ఎటువంటి స్పందనా లేదని, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. పోలవరం మండలం కొరుటూరు, తూటిగుంట, కోండ్రుకోట గ్రామాలకు చెందిన ప్రాజెక్టు నిర్వాసితులు ఎ వేణుబాబు, పుట్టి రమణ, కె నాగేశ్వరరావు మరికొంతమంది ఫిర్యాదు చేస్తూ ఆర్‌అండ్‌ఆర్ నిర్వాసిత కాలనీల్లో తమకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లు, కేటాయించిన స్థలాల్లో కొంతమంది ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి అర్హులుకాని వారు అధికారులను తప్పుదోవ పట్టించి తమ పేర్లు నమోదు చేయించుకున్నారని చెప్పారు. తమ గ్రామానికి ఎటువంటి సంబంధం లేని వారు, పెళ్లయి వెళ్లిపోయిన వారు, 18 సంవత్సరాలు నిండని వారిని కూడా లబ్దిదారులుగా చేర్చారని చెప్పారు. మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 బిఆర్ అంబేద్కర్, డీఆర్వో ఎన్ సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ అమరేశ్వరరావు, డీఈవో రేణుక, మత్స్యశాఖ జేడీ డాక్టర్ అంజలి, ఐసీడీఎస్ పీడీ విజయకుమారి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శంకర్‌రావు, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎస్‌ఎస్ మూర్తి, ఎల్‌డిఎం సూర్యారావు, జడ్పీ సీఈవో వి నాగార్జునసాగర్ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.