పశ్చిమగోదావరి

టెన్షన్..టెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 11: తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి విడతలోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వాహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చెయ్యడంతో జిల్లాలోని రాజకీయపార్టీల నేతల్లో ఒక్క సారిగా టెన్షన్ వాతావరణం కనిపించింది. పైగా చాలా తక్కువ సమయం ఉండటంతో వారంతా అయోమయంగా కనిపించారు. అప్పుడే ఎన్నికలా? ఇన్ని రోజులే ఉన్నాయా? అంటూ ఎవరికి వారు తమ సన్నిహితులకు ఫోన్లు చేసుకుని ఏం చేయాలో సలహాలు, సూచనలు తీసుకోవడం కనిపించింది.
ఇక జిల్లా రాజకీయాలను పరిశీలిస్తే అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూనే ఉంటారు. ఆ వ్యూహాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపుగా పది నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించడం జరిగింది. ఇంకా ఐదు నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉండగా ఆ నియోజకవర్గాల వారితో సోమవారం నాడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్యన ఉన్న చిన్నపాటి విద్వేషాలను పక్కన పెట్టి పార్టీ గెలుపుకోసం పని చేయాలని ఆదేశించారు. రాజకీయ చతురత కలిగిన చంద్రబాబు నాయుడు పది అసెంబ్లీలోని సిట్టింగ్‌లకే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నరసాపురం పార్లమెంట్ పరధిలోని నరసాపురం, పాలకొల్లు, ఆచంట, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించారు. ముఖ్యంగా చెప్పాలంటే అభ్యర్ధుల ప్రకటనలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది.
ఇక జిల్లాలో వైసీపీ అభ్యర్ధుల ప్రకటన విషయంలో వెనుకంజలోనే ఉంది. వైసీపీ మాత్రమే కాదు జనసేన పరిస్థితి కూడా అదేరీతిలో కనిపిస్తోంది. జిల్లాలోని ప్రజా సంకల్పయాత్రలో భాగంగా భీమవరం బహిరంగ సభలో భీమవరం అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ అని ప్రకటించడం జరిగింది. జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్క టిక్కెట్టు మాత్రమే ప్రకటించడం జరిగింది. మిగిలిన 14 నియోజకవర్గాల అభ్యర్ధులను ఇప్పటి వరకు ప్రకటించలేదు. పైగా వైసీపీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి వైసీపీ జంపింగ్‌లు ప్రారంభమయ్యాయి. మరో పక్క ఎన్నికలకు సమయం కూడా చాలా తక్కువగా ఉంది. ఎన్నికల అభ్యర్ధులు ప్రకటిస్తే ఎన్నికల ప్రచారానికి కూడా సమయం లేకుండా ఉంది. ఈ నేపధ్యంలో ఆశావహుల్లో టెన్షన్ వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే అసలు ఆశావహుల సంఖ్యే చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎవరికి వారు పోటాపోటీగా విజయవాడ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తులు చేసుకున్నప్పటికీ పోటీచేసే స్థాయి ఎంత వరకు ఉందన్న విషయాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంకా కమిటీలతోనే పవన్ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలేకపోలేదు. జిల్లాలో ఒక్క బెర్త్‌ను కూడా జనసేన ఇప్పటి వరకు ప్రకటించకపోవడం విశేషం.
ఇక జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లు అభ్యర్ధుల విషయంలో నాన్చుడు ధోరణిలోనే ఉన్నారు. అసలు బీజేపీ, కాంగ్రెస్‌లకు అభ్యర్థులు ఉన్నారా అనే ప్రశ్న జిల్లాలో ఉత్పన్నమవుతోంది. ఉంటే చూపించండి అంటూ ప్రశ్నిస్తున్నారు. మరో పక్క ఈ నెల 13వ తేదీన భారతీయ జనతా పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన అభ్యర్ధులను ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే ఎంత వరకు ఇవి వాస్తవరూపం దాల్చుతాయో వేచి చూడాల్సిందే.