పశ్చిమగోదావరి

వశిష్ఠ కప్ విజేతలు ఐసిఎఫ్, రామచంద్రపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, మే 15: నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన వశిష్ట బాస్కెట్‌బాల్ కప్‌ను పురుషుల విభాగంలో ఐసిఎఫ్ చెన్నై జట్టు, మహిళల విభాగంలో రామచంద్రపురం జట్లు కైవసం చేసుకున్నాయి. నాలుగురోజులుగా స్థానిక వైఎన్ కళాశాలలో నిర్వహించిన జాతీయస్థాయి పురుషులు, మహిళల బాస్కెట్‌బాల్ టోరీ ఆదివారం రాత్రి ముగిసింది. పురుషుల విభాగంలో ఐసిఎఫ్ చెన్నై, సౌత్ సెంట్రల్ రైల్వే జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఐసిఎఫ్ చెన్నై జట్టు 23-71 పాయింట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. అలాగే తృతీయస్థానంలో ఇన్‌కంటాక్స్ హైదరాబాద్, నాల్గవ స్థానంలో సిఎల్‌డబ్ల్యు చిత్తరంజన్ జట్లు నిలిచాయి. అలాగే మహిళల విభాగంలో రామచంద్రపురం, కృష్ణా జట్ల మధ్య ఫైనల్స్ జరిగాయి. ఈ పోరులో 39-33 పాయింట్ల ఆధిక్యతతో రామచంద్రపురం విజయం సాధించింది. తృతీయస్థానంలో జిఎస్‌ఇ గుంటూరు, నాల్గవ స్థానంలో ఏలూరు జట్లు నిలిచాయి. గెలుపొందిన పురుషుల జట్లకు మొదటి బహుమతిగా రూ.50వేలు, ద్వితీయ బహుమతిగా రూ.35వేలు, తృతీయ బహుమతిగా రూ.25వేలు, మహిళా జట్లకు మొదటి బహుమతిగా రూ.10వేలు, ద్వితీయ బహుమతిగా రూ.7వేలు, తృతీయ బహుమతిగా రూ.5వేలు నగదుతోపాటు వశిష్టా కప్‌ను బహూకరించారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, శాప్ ఛైర్మన్ పిఆర్ మోహనరావు, బాస్కెట్‌బాల్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ స్టాలిన్, ఒలింపిక్ క్రీడాకారిణి సత్తి గీతలు విజేతలకు బహుమతులు అందించారు. వశిష్ట కప్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ చినమిల్లి సత్యనారాయణరావు, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పొత్తూరి రామరాజు, ఎఎంసి ఛైర్మన్ రాయుడు శ్రీరాములు, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బండారు పటేల్ రాజానాయుడు, అర్బన్ బ్యాంకు ఛైర్మన్ నర్సయ్య పాల్గొన్నారు.