పశ్చిమగోదావరి

అందరి భాగస్వామ్యంతోనే ఆరోగ్యకర సమాజం:మంత్రి పైడికొండల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, మే 15: ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. స్వచ్ఛ్భారత్ సందర్భంగా స్థానిక బస్టాండులో స్వచ్ఛ్భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రత నైతిక బాధ్యత అన్నారు. పరిశుభ్రతతో అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో మహిళలు నిస్సిగ్గుగా బహిర్భూమికి వెళ్లి రావడం దురదృష్టకరమన్నారు. ప్రధాని మోదీ మహిళల ఆత్మగౌరవం కాపాడటానికి ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించాలని నిర్ణయించారన్నారు. ఆర్టీసీ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులదేనని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు పాశం నాగమణి, ఆర్టీసీ సిఐ బి.రాజ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ పి.నిరంజన్‌రెడ్డి, కౌన్సిలర్ యెగ్గిన నాగబాబు, ఆర్టీసీ డిఎం సిఎన్ మూర్తి, గ్రంథి సత్యనారాయణ, బిజెపి నాయకులు కంచుమర్తి నాగేశ్వరరావు, కోట రాంబాబు పాల్గొన్నారు.