పశ్చిమగోదావరి

వర్షాకాలంలోపే చెరువుల పూడికతీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, మే 15: నీరు-చెట్టు పథకం కింద వర్షాకాలం వచ్చేలోపే జిల్లాలో పెద్ద ఎత్తున చెరువుల పూడికతీత పనులు పూర్తి చేసి వర్షపు నీరు నిల్వ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాత తెలిపారు. మండలంలోని అక్కంపేట గ్రామంలో నీరు-చెట్టు పథకం కింద పానకాల చెరువు పూడికతీత పనులను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత పొక్లెయిన్ నడిపి చెరువులో మట్టిపూడిక తీసి ట్రాక్టర్‌లో లోడు చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా భూగర్భ జలాలు పెంపొందించేందుకు నీరు-చెట్టు, జాతీయ ఉపాధి హామీ పథకాల ద్వారా చెరువుల పూడికతీత పనులు, ఇంకుడు గుంతలు, ఫారం ఫాండ్స్ దోహద పడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృహత్తర కార్యాచరణ ప్రారంభించారన్నారు.
చింతలపూడి నియోజకవర్గంలో నీరు-చెట్టు పథకంలో 20 కోట్ల రూపాయల నిధులతో 98 చెరువుల పూడిక తీత పనులు చేపట్టినట్టు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలో పది చెరువుల పూడికతీత పనులు పరిపాలనా ఆమోదం పొందాయన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు మండవ లక్ష్మణరావు, జడ్పీటిసి సభ్యుడు శీలం రామచంద్రరావు, సర్పంచ్ గంధం గోపాలకృష్ణ, ఉప సర్పంచ్ గొల్లమందల శ్రీనివాసరావు, ఎంపిటిసి సభ్యుడు వింజమూరి సంజీవరావు, నాయకులు పెనుమర్తి రామ్‌కుమార్, దల్లి కృష్ణారెడ్డి, ముళ్ళపూడి శ్రీనివాసరావు, గంటా రామారావు, వందనపు హరికృష్ణ, మద్దిపాటి నాగేశ్వరరావు, ఎస్‌ఎస్ ఇస్మాయిల్, కొండ్రెడ్డి కిశోర్, యెలికే తాతారావు, లింగాల సత్యనారాయణ, జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఆర్ సతీష్‌కుమార్, డిప్యూటీ ఇఇ ఆర్ ప్రసాద్, డిటి వేదవతి, ఇఒ పిఆర్‌డి బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.