పశ్చిమగోదావరి

మూడు పథకాలపై ప్రభుత్వం దృష్టి:మంత్రి సుజాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 15 : రాష్ట్రంలో నీటి ఎద్దడి నివారణ, భూగర్భజలాలు పెరిగేందుకు నీరు-ప్రగతి, పంట సంజీవని, నదుల అనుసంధానం వంటి మూడింటిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. ఆదివారం లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడెంలో నీరు-చెట్టు కింద 15 లక్షల రూపాయలతో చేపట్టిన తాళ్లచెరువు పూడికతీత పనులను రాష్ట్ర మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీరు-చెట్టు, పంట సంజీవని కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వర్షాకాలంలో భూగర్భజలాలు మరింత పెరిగే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ సందర్భంగా నల్లిమిల్లి సత్యనారాయణ తదితరులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పీతల సుజాత పంపిణీ చేశారు. తొలుత తాళ్ల చెరువు పూడికతీత పనులను మంత్రి సుజాత ప్రారంభించి స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు.