పశ్చిమగోదావరి

పెంటపాడు మండల పరిషత్ ఉపాధ్యక్షుని రాజీనామా ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 23 : పెంటపాడు మండల ప్రజాపరిషత్తు ఉపాధ్యక్ష పదవికి పడాల ఉమాశంకర్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా చేసిన రాజీనామాను ఆమోదించినట్లు జడ్పీ సి ఇవో సత్యనారాయణ తెలిపారు. ఆకుతీగపాడు ఎంపిటిసిగా కొనసాగుతానని ఉమాశంకర్ తెలియజేసిన దృష్ట్యా పెంటపాడు మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఆమోదించినట్లు ఆయన తెలిపారు.

టిడిపికి ప్రత్యామ్నాయం లేదు

భీమవరం, మే 23: రాజధానికి కూడా నోచుకోని రాష్ట్రాన్ని అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ లక్ష్యమని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయం ఉండబోదని జోస్యం చెప్పారు. ఆర్థిక లోటు ఉన్నా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు నిర్విఘ్నంగా కొనసాగించగల పరిపాలనా దక్షత ఉన్న నాయకత్వం ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో వెనుదిరిగి చూడబోదన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో మరింత చొరవ అవసరమని అభిప్రాయపడ్డారు. రాజకీయ ఉనికి చాటుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నొక్కి చెప్పారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేలా సాగిన ప్రసంగాలకు ఆచంటలో నిర్వహించిన మినీ మహానాడు వేదికగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా నిర్వహించే మినీ మహానాడును డెల్టాలోని నియోజకవర్గ కేంద్రం ఆచంటలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. మినీ మహానాడును జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా మినీ మహానాడు సాగింది.
జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆయా వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. ఇవన్నీ భవిష్యత్తులో అఖండ విజయానికి పునాదులన్నారు. జిల్లాకు అవసరమైనవి పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి చేసే తీర్మానాలను, నియోజకవర్గ స్థాయిలో వచ్చిన తీర్మానాలను తిరుపతిలో మహానాడుకు సమర్పిస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రభుత్వ కార్యక్రమాలను మరింత విస్తృతంగా క్షేత్ర స్థాయికి తీసుకువెళ్ళాలని పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయకంగా జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాడి తెలుసుకోవాలంటే ముందుగా పశ్చిమగోదావరి జిల్లా నాడి పట్టుకోవాలన్నారు. రాష్ట్భ్రావృద్ధి, ప్రజలకు నచ్చిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నారు. ఇటువంటి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం కష్టపడుతుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదన్నారు. 14వ ఆర్థిక సంఘం 2022 తరువాత కూడా రాష్ట్రం ఇంకా వెనుకబడే ఉంటుందని చెబుతుందని గుర్తుచేశారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వెనుకంజలో ఉందని గణాంకాలే చెబుతున్నాయని కళా వెంకట్రావు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా అర్హత లేని జగన్ దీక్షలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ జైలుకు ఎందుకు వెళ్ళావు.. బెయిల్ మీద ఎందుకు ఉన్నావు.. ఇంకా ఎందుకు సంతకాలు పెడుతున్నావని కళా వెంకట్రావు విమర్శనాస్త్రాలు సంధించారు. యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువనాయకత్వం అవసరం పార్టీకి ఎంతైనా ఉందన్నారు. నారా లోకేష్ ఇప్పటికే 52 లక్షల మందిని తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా చేర్చారని గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్యాయంతో ముందుకు నడుపుతున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. అందరూ కలిసికట్టుగా పార్టీని ముందుకు నడుపుదామన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీయే అధికారం చేపడుతుందని కళా వెంకట్రావు ఆశాభావం వ్యక్తంచేశారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 1982లో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని, అప్పటి నుంచి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా మహానాడును నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ మహానాడులో వర్తమాన, భవిష్యత్తు రాజకీయాలు, ప్రజలకు అందిస్తున్న పాలన తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కోసం తీర్మానాలు చేస్తామని తెలిపారు. రాష్ట్రం ఇప్పటికే రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్‌లో ఉందన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 5 వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు నిర్మించనున్నామని, ఇందుకు రూ.3 వేల కోట్లు కూడా కేటాయించామని తెలిపారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసునని, చంద్రబాబు వచ్చిన తరువాత రహదారులకు, తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న కొత్త ముఖాలు తెలుగుదేశం పార్టీ కన్నా ఎన్టీఆర్ గురించి తెలుసుకోవాలన్నారు. మంత్రి పీతల సుజాత మాట్లాడారు. ముఖ్యంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడును ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గజమాలలతో సత్కరించారు.