పశ్చిమగోదావరి

జన్మభూమి వినతులు పరిష్కరించని వారిపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 23 : జన్మభూమి మూడు విడతల్లో వచ్చిన ప్రజా వినతులను నేటి సాయంత్రం లోగా పరిష్కరించని అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లాలో ఇప్పటి వరకూ మూడు విడతల్లో జన్మభూమి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించిందని, అయితే తొలి విడత జన్మభూమిలో వచ్చిన ప్రజాసమస్యలను కూడా పరిష్కరించకపోతే ఎలా? అసలు జన్మభూమిలో వచ్చిన పిటీషన్లు చూడడం వచ్చా? అని అధికారులను ప్రశ్నించారు. కార్యాలయంలో గుమస్తాలపై ఆధారపడి ఆన్‌లైన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తే జిల్లా అధికారులు వాస్తవాలు తెలుసుకోలేకపోతారని కొన్ని శాఖల అధికారులు అసలు జన్మభూమిలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి వుందని, ఇకనైనా జిల్లాస్థాయి అధికారులు జన్మభూమి, మీ-సేవ, ఇ-ఫైలింగ్ విధానం, మీ-కోసం వంటి కార్యక్రమాల్లో ఆన్‌లైన్‌లో సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. జన్మభూమి మూడవ విడత కార్యక్రమం జరిగే అయిదు నెలలు దాటిందని, అయినా జిల్లాస్థాయిలో ఏడు, మండల స్థాయిలో 58 ప్రజా ఫిర్యాదులు పరిష్కారం కాలేదని కలెక్టర్ చెప్పారు. ప్రతీ సోమవారం జరిగే మీ-కోసంలో 346 లర్జీలు గడువు దాటి పరిష్కరించకుండా ఉన్నాయని వాటిని సాయంత్రం లోగా పరిష్కరించి తనకు తెలిపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాజాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు
విజయవాడలో ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశంనకు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ ప్రధాన శాఖల ప్రగతి తీరుపై సమగ్ర సమాచారాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులతో చర్చించారు. గత ఏడాది వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతి తీరు రాబోయే ఆర్ధిక సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలు ప్రణాళికల అమలు తీరుపై కలెక్టరు ఆయా శాఖల అధికారులతో చర్చించారు. జిల్లాలో భూసార పరీక్షలు పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అమలు చేస్తున్న కార్యక్రమ ప్రగతి తీరును కలెక్టర్ సమీక్షించారు. దేశంలోనే ప్రప్రధమంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులందరికీ భూసార హెల్త్ కార్డులను అందించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన తీరు అమలు జరుగుతున్న ప్రగతిని చర్చించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 64 కోట్ల రూపాయల వ్యయంతో రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను పరికరాలను అందించాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా వ్యవసాయాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. అదే విధంగా ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖలతోపాటు పది ప్రధాన ప్రాధాన్యతారంగాల ప్రగతిపై సమీక్షించారు.
కౌలు రైతులందరికీ రుణాలకు చర్యలు తీసుకోవాలి
జిల్లాలోని రుణ అర్హత కార్డులు జారీచేసిన కౌలు రైతులందరికీ రుణాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మండల అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి సోమవారం రుణ అర్హత కార్డులు జారీ, బయోమెట్రిక్ హాజరు, ప్రజా విజ్ఞప్తుల పరిష్కారం, దీపం పధకం, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, జాతీయ గ్రామీణ ఉపాధి పధకం తదితర కార్యక్రమాల అమలుపై తహశీల్దార్లు, ఎంపిడివోలు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేశామని, వారికి పంట రుణాలు అందించేందుకు రెవిన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో బ్యాంకర్లతో చర్చించాలన్నారు.

తీర్మానాలు ప్రవేశపెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, మే 23: ఆచంటలో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన మినీ మహానాడులో అనేక అంశాలపై చర్చ జరిగింది. చర్చలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆర్థిక అసమానతలు, పేదరిక నిర్మూలనపై ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్‌రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నీరు - ప్రగతిపై గన్ని వీరాంజనేయులు, ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి తీర్మానాన్ని అంబికా కృష్ణ, అభివృద్ధి పథంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, సమగ్ర జలవిధానం - ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక, శాంతి భద్రతల పరిరక్షణపై బండారు మాధవనాయుడు, స్థానిక సంస్థల బలోపేతంపై జడ్పీ ఛైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, మానవ వనరుల అభివృద్ధి - విద్యా, వైద్యరంగాలకు పెద్ద పీటపై ఎమ్మెల్సీ షరీఫ్, పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణపై ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, ప్రత్యేక హోదాపై గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టుపై మొడియం శ్రీనివాసరావు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి - ప్రోత్సాహకాలపై కెఎస్ జవహర్ ఇతర అంశాలపై ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు తీర్మానాలను ప్రవేశపెట్టారు.
రాజకీయ జీవితాన్నిచ్చింది ఆచంట
ఆచంట, మే 23: తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఆచంట అని మంత్రి పీతల సుజాత అన్నారు. సోమవారం ఆచంటలో జరిగిన మినీ మహానాడులో మాట్లాడుతూ తనకు పుట్టిల్లు అచంట అయితే మెట్టినిల్లు చింతలపూడి అన్నారు. ఈ రెండు ప్రాంతాల ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. గతంలో వేల కోట్ల రూపాయల ఇసుక మాఫియా జరిగిందని, అయితే టిడిపి ప్రభుత్వం అవినీతికి అస్కారం లేకుండా ఉచిత ఇసుకవిధానాన్ని తీసుకువచ్చిందన్నారు. ఏనాడు అభివృద్ధి గురించి మాట్లాడని జగన్ దొంగదీక్షలు చేస్తూ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో వైసిపికి పుట్టగతులు లేకుండా చేయాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ దమ్మున్న నాయకుడు చంద్రబాబే అని మంత్రి సుజాత స్పష్టం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ మహానాడుకు ఆక్సిజన్ ఇవ్వడం లాంటిదే ఈ మినీమహానాడన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాకు 120 కోట్లు కేటాయించామన్నారు. జడ్పీ ఛైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడుతూ జిల్లాలో తాడిపూడి ఎత్తిపోతల పథకానికి నూరుశాతం నిధులు కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాలని తీర్మానం చేయాలని కోరారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు 17వేల ఎకరాల అటవీభూమిని నోటిఫికేషన్ చేయాలని తీర్మానించాలన్నారు. కొల్లేరు కాంటూరును కుదించి సరస్సుపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకోవాలని కోరారు.
అందరి పండుగ మహానాడు
అన్నిమతాలు, కులాలు కలిపి చేసుకునే పండుగ మహానాడు అని జిల్లా టిడిపి ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. సోమవారం ఆచంటలో జిల్లా టిడిపి అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం ఇవ్వాలని అలోచించింది ఎన్టీఆర్ మాత్రమే అన్నారు. జిల్లా టిడిపి అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మినీమహానాడును పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మినీ మహానాడులో వచ్చిన సమస్యలను మహానాడులో కూడ చర్చిస్తామన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు మాట్లాడుతూ చంద్రబాబు ఆశావాది అని, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కృషిచేస్తున్నారని అన్నారు.