పశ్చిమగోదావరి

ఈ పాస్ విధానంలో ఎరువులు, పురుగుమందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 14 : జిల్లాలో ఇ-పాస్ విధానం ద్వారా రైతులకు ఎరువులు, పురుగుమందులు సరఫరా చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. ఏలూరు కలెక్టరు కార్యాలయంలో మంగళవారం ఇ-పాస్ విధానం ద్వారా రైతులకు ఎరువులు, పురుగుమందులు సరఫరా చేసేందుకు మొబైల్ బేస్డ్ ఫర్టిలైజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై ఫెర్టిలైజర్స్ డీలర్లతో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఇ-పాస్ విధానం ద్వారా వినియోగదారులకు బియ్యం, కిరోసిన్ వంటి రేషన్ సరుకులు సరఫరా చేసే విధంగానే ఇకపై రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులను ఇ-పాస్ విధానం ద్వారా అందజేయడానికి పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణాజిల్లాల్లో ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. డీలర్లు తమకు కావాల్సిన ఎరువులు, పురుగుమందుల వివరాలను ఆయా కంపెనీలకు ఆన్‌లైన్ ద్వారా ఇండెంట్ పెట్టి సరుకు వచ్చిన తర్వాత మొబైల్ ద్వారా వాటి వివరాలను నమోదు చేసుకుని రైతులకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఏ ఏ రైతులు ఏ ఏ పంటలు పండిస్తున్నారో వారికి ఎంత మోతాదులో ఎరువులు, పురుగుమందులు కావాలో సంబంధిత వివరాలు ఆన్‌లైన్‌లో నమోదై ఉంటాయని వాటి ఆధారంగా వారికి ఇ-పాస్ విధానం ద్వారా వాటిని అందజేయడం జరుగుతుందన్నారు. ఈ విధానం వలన రైతులు ఎక్కడ నుంచైనా వారికి కావాల్సిన ఎరువులు, పురుగుమందులను కొనుగోలు చేయవచ్చునని అవి దొరకనప్పుడు వేరే ప్రాంతం నుండి కొనుగోలు చేయడం వలన ఎక్కడా ఎరువులు కొరత ఉండబోదని కలెక్టర్ చెప్పారు. ఈ విధానం వలన ఏ డీలరు వద్ద ఎంత స్టాకు నిల్వ ఉన్నదో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుందని చెప్పారు. ఆధార్ అనుసంధానంతో జిల్లాలో 92 శాతం వరకూ ఇ-పాస్ ద్వారా వినియోగదారులకు రేషన్ సక్రమంగా అందజేయబడుతోందని అదే విధంగా రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులను ఇ-పాస్ ద్వారా సమర్ధవంతంగా అందజేసే వీలుంటుందని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో ఫెర్టిలైజర్స్ డీలర్లకు ఇ-పాస్ విధానంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, వ్యవసాయ శాఖ జెడి సాయి లక్ష్మీశ్వరి, డి ఎస్‌వో కె శివశంకర్‌రెడ్డి, ఎన్ ఐసి అధికారి ఉదయభాస్కర్, ఫర్టిలైజర్ డీలర్లు పాల్గొన్నారు