పశ్చిమగోదావరి

రైతుల సమగ్ర మేలుకు పటిష్ఠ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 4: జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్ది నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు సమగ్ర మేలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం మైక్రో ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నూతన పండ్లతోటలను ప్రోత్సహించాలని తక్కువ ఖర్చుతో రైతు అధిక దిగుబడి సాధించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోనికి తీసుకురావాలని అప్పుడే జిల్లాలో ఉద్యానవన పంటలు అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. ఉద్యాన వన పంటలకు బిందు, తుంపర సేద్యాన్ని అమలు చేయడం వలన కూలీల సమస్య లేకుండా తక్కువ నీటితో ఉద్యానవన పంటలను సమృద్ధిగా పెంచుకోవడానికి మైక్రో ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రతీ ఎకరం భూమిలో బిందు సేద్యాన్ని అమలుచేసినప్పుడే ఖర్చులు తగ్గి రైతు ఆనందంగా ఉండగలుగుతారని చెప్పారు. జిల్లాలో 2016-17 ఆర్ధిక సంవత్సరంలో 25 వేల హెక్టార్లలో బిందు సేద్యాన్ని అమలు చేయాలని ఈ విషయంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న 19 కంపెనీలు యుద్ధప్రాతిపదికపై రైతులకు అందుబాటులో ఉంటూ బిందు సేద్యాన్ని అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో వ్యవసాయంతోపాటు ఉద్యానవన పంటల పెంపుదలకు ఎన్నో అవకాశాలున్నాయని ముఖ్యంగా పూలతోటల పెంపకంపై కూడా రైతులు దృష్టి కేంద్రీకరించేలా చూడాలని ఔషధ మొక్కలతోపాటు సుగంధ ద్రవ్యాల మొక్కలను కూడా పెద్ద ఎత్తున పెంచేలా రతులను ప్రోత్సహిస్తూ బిందు, తుంపర సేద్యాలను అమలు చేసినప్పుడే రైతు ఆనందంగా ఉంటాడని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో బిందు సేద్యాన్ని అమలుచేయడానికి ప్రభుత్వంతో గత ఏప్రిల్‌లో ఒప్పందం కుదుర్చుకున్న 16 కపంనీలలో మూడు కంపెనీలు అనంత, నంది, కుమార్ సంస్థలు కనీసం జిల్లా దరిదాపుల్లోకి రాలేదని అటువంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ ఎడి ఎస్ రామ్మోహనరావును కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో బిందు, తుంపర సేద్యాన్ని అమలు చేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని నాలుగు నెలలైనా ఈ కంపెనీల ప్రతినిధులు జిల్లాలో కనిపించకపోవడంతో ఆయా సంస్థలపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కుమార్ సంస్థకు చెందిన ప్రతినిధి ఇంకా సిబ్బందిని నియమించుకుటున్నామని చెప్పడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు తాము అన్ని సిద్ధంగా ఉన్నామని చెప్పి నేడు రైతులకు సేవలు అందించకపోవడాన్ని కలెక్టర్ తప్పుపట్టారు. పనిచేయలేనప్పుడు ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని మీ వల్ల రైతులు ఇబ్బందిపడితే ఎలా అని కలెక్టర్ ప్రశ్నించారు. జిల్లాలో బిందు సేద్యం అమలు చేయడానికి ముందుకు వచ్చిన కంపెనీలు నిర్ణీత కాల వ్యవధిలో క్షేత్రస్థాయిలో బిందు సేద్యం పరికరాలను అమర్చి రైతుకు మేలు చేయాలని ఎక్కడైనా నిర్లక్ష్యంగా వ్యవహరించే కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టి రాష్ట్రంలో ఎక్కడా పనిచేయకుండా చేస్తానని హెచ్చరించారు. రైతుకు మేలు జరుగుతుందనే భావనతో ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి బిందు, తుంపర సేద్యాలను ప్రోత్సహిస్తుందని పరిపాలనామోదం ఇచ్చినంత మాత్రాన తనకు కుదరదని క్షేత్రస్థాయిలో బిందు సేద్యం అమలు చేసి తీరాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. తన వద్దకు ఏ ఫైలు వచ్చినా గంటన్నరలో సంతకం పెట్టి పంపిస్తానని తన స్పీడుకు తగ్గట్టుగా నాణ్యతతో కూడిన పని విధానాన్ని అమలు చేయడానికి ముందుకు రావాలని, అలా పనిచేయలేనప్పుడు ముందుగానే తప్పుకోవడం మంచిదని లేకపోతే నిర్లక్ష్యం వహించే వారెవరైనా మూల్యంచెల్లించకతప్పదని హెచ్చరించారు. కంపెనీలో సిబ్బంది కొరత, తదితర అంశాలన్నీ ఆయా కంపెనీల ప్రతినిధులు పరిష్కరించుకోవాలే తప్ప వారి సమస్యలు తమకు సంబంధం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మైక్రో ఇరిగేషన్ ఓఎస్‌డి బి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.