వరంగల్

ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై చర్యలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 2: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో నాళాల ఆక్రమణలను తొలగించే విషయంలో నగరపాలక సంస్థ అధికారుల పనితీరుపై వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌తోపాటు పలు కార్పొరేటర్లు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసారు. నాళాలపై జరిగిన ఆక్రమణలను గుర్తించి వాటిని తక్షణం తొలగించాలని తాము అధికారులకు స్పష్టం చేస్తే ఆక్రమణదారులు తమపై తప్పుడు ఆరోపణలు చేసారని, దీనివెనక టౌన్‌ప్లానింగ్ అధికారుల సహకారం ఉందని ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఆరోపించారు. నాళాలను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఆక్రమ నిర్మాణాలు చేపడుతుంటే టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టనట్లుగా వ్యవహరించటాన్ని తప్పుపట్టారు. నాళాల ఆక్రమణల విషయంలో విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. నగర మేయర్ నన్నపునేని నరేందర్ అధ్యక్షతన గురువారం మహానగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ గత వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా అటు హైద్రాబాద్, ఇటు వరంగల్ నగరం అతలాకుతలమైతే హైద్రాబాద్‌లో మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ అధికారులు నాళాలపై జరిగిన ఆక్రమణలను తొలగించటం ద్వారా సమస్యను సత్వరం పరిష్కరించారని, కానీ ఇక్కడ నాళాల ఆక్రమణల తొలగింపులో టౌన్‌ప్లానింగ్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. మొదట్లో ఏవో కొన్ని ఆక్రమణలు తొలగించిటం ద్వారా హడావుడి చేసిన అధికారులు ఆ తరువాత మిన్నకుండిపోవటాన్ని తప్పుపట్టారు. ఇప్పటి వరకు ఎన్ని ఆక్రమణలను గుర్తించారు, ఎన్నింటిని తొలగించారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు గురవుతున్నా, ఈ విషయం సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవటంతో ఆక్రమణలు కొనసాగుతున్నాయని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌కు మద్దతుగా పలువురు కార్పొరేటర్లు జోక్యం చేసుకుని ఆక్రమణల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్రమణదారులకు సహాయసహకారాలు అందిస్తున్నారని, నాళాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో కోర్టుకు వెళ్లాలని ఆక్రమణదారులకు టౌన్‌ప్లానింగ్ విభాగం బాధ్యులై సలహాలు ఇస్తున్నారని ఆరోపించారు. నగరంలోని అన్ని డివిజన్లకు కలిపి రాంపూర్-మడికొండ మధ్య ఒకే డంపింగ్ యార్డు ఏర్పటుచేయటం వలన ఈ ప్రాంతాలు చెత్తమయంగా మారిపోయాయని, డంపింగ్ యార్డుతో భూగర్భజలాలు కలుషితమయ్యాయని కార్పొరేటర్ జోరిక రమేష్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. నగరంలోని వివిధ డివిజన్లలో నగరపాలక సంస్థ సిబ్బంది వీధికుక్కలను పట్టుకుని రాంపూర్ ప్రాంతంలో స్టెరిలైజేషన్ చేసి అక్కడే వదిలపెడుతున్నారని, దీనివల్ల పరిస్థితి ఇంటికి రెండు, మూడు కుక్కల మాదిరిగా మారిందని, రాత్రిపూట ప్రజలు రోడ్లపైన తిరగాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. నగరంలోని పలు వార్డులలో కుక్కలు, కోతులు, పందుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, రోడ్లపైన వెళ్లే మనుషులను కరవటంతో ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు.
కాగా సమావేశంలో నీటిపన్నుల పెంచాలని ప్రతిపాదన వచ్చిన సందర్భంలో సమావేశంలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన తన నియోజకవర్గంలోని శివారు గ్రామాల అభివృద్ధిలో నగరపాలక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తప్పుపట్టారు. విలీనం జరిగిన తరువాత గ్రామపంచాయతీలకు సంబంధించిన సిబ్బందిని, నిధులను స్వాధీనం చేసుకున్న నగరపాలక సంస్థ శివారు గ్రామాలతో ఏర్పడిన డివిజన్లలో సదుపాయాల కల్పనను పట్టించుకోకపోవటాన్ని ప్రశ్నించారు. కనీస వసతులైన రోడ్లు, మంచినీరు, విద్యుత్ తదితర సదుపాయలు లేక శివారు డివిజన్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా పన్నులు పెంచటం సరికాదని వ్యాఖ్యానించగా ఎమ్మెల్యే రమేష్‌కు మద్దతుగా శివారు డివిజన్‌లో నీటిపన్నుతో పాటు ఇతర పన్నులు కూడా పెంచవద్దని డిమాండ్ చేసారు. వరంగల్ మహానగర పరిధిలో ప్రస్తుతం ఉన్న సుమారు 39వేల వీధిదీపాలతోపాటు కొత్తగా మరో 14400 వీధి దీపాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, సాధారణ బల్బులు, ట్యూబ్‌లైట్లు, మెర్క్యురీ లెట్ల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను అమర్చాలనిప్రభుత్వం నిర్ణయించిందని, దీనివల్ల నగరపాలక సంస్థకు ప్రతి యేడాది ఆరుకోట్ల రూపాయల విద్యుత్ బిల్లు ఆదా ఆవుతుందని నగర మేయర్ నరేందర్ సమావేశంలో తెలిపారు.