వరంగల్

నా కళ్ళ ముందే నరికి చంపారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, ఫిబ్రవరి 26: మంగపేట మండలం కమలాపురం ఆర్‌పిహెచ్ కాలనీ (టిడిపి కాలనీ)లో శనివారం అర్ధరాత్రి ఇద్దరు యువకులు దారుణ హత్య సంఘటన సంచలన సృష్టించింది. మృతుల్లో ఒకరైన జర్పుల కళ్యాణ్‌ను అతి కిరాతంకా హత్య చేశారని మృతుడి నాయనమ్మ జర్పుల సమ్మక్క తెలిపింది. తన కళ్ళ ముందే తన మనవడు జర్పుల కళ్యాణ్‌తో పాటు నర్ర శ్రీనులను అతి కిరాతకంగా నరికి చంపారని జర్పుల కళ్యాణ్ నాయనమ్మ జర్పుల సమ్మక్క రోదిస్తూ తెలిపింది. జర్పుల సమ్మక్క తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో కళ్యాణ్, శ్రీనులు ఇంటికి వస్తుండగా వారిద్దరిని భూక్యా రవి, అతని కటుంబ సభ్యులు బలవంతంగా భూక్యా రాజు ఇంట్లోకి లాక్కెళ్తుండగా నాకు ఆ వినికిడి వినిపించి అక్కడికి వెళ్ళాను. అప్పటికే అక్కడ ఉన్న భూక్యా రాజు, భూక్యా లచ్చులు, భూక్యా రవి, గుగులోతు రాజు, ఇస్లావత్ శంకర్, గుగులోతు శ్రీకాంత్, భూక్యా దేవేందర్‌లు నర్ర శ్రీను, జర్పుల కళ్యాణ్‌లను చేతులు కట్టి లాక్కుని వెళ్తుంటే వదిలిపెట్టమని కాళ్ళపై పడ్డాను. కానీ వారు నన్ను తోసివేసి నేను చూస్తుండగానే కత్తులు, గొడ్డళ్ళు, గునపాలతో నర్ర శ్రీను, జర్పుల కళ్యాణ్‌లను నరికి చంపారని జర్పుల సమ్మక్క తెలిపింది.
శనివారం రాత్రి ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారని తెలుసుకున్న సంబంధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆదివారం వేకువ జాముకే సంఘటనా స్థలానికి భారీ ఎత్తున చేరుకున్నారు. దీంతో మృత దేహాలను చూసేందుకు మీడియాకు సైతం పోలీసులు అనుమతించలేదు. దీంతో నర్ర శ్రీను, జర్పుల కళ్యాణ్‌లు ఎలా హత్య చేయబడ్డారో కూడా ఎవరికీ తెలియలేదు. ఆదివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో క్లూస్ టీం, ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్ హెగ్డే సంఘటన స్థలంనకు వచ్చిన తర్వాతే మీడియా వారికి అనుమతి ఇచ్చారు. అనంతరం హత్య జరిగిన సంఘటన వివరాలను తెలుసుకున్న మృతుల బంధువులు పెద్ద ఎత్తున రోదించారు. తమ వారిని హత్య చేసిన వారిని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టమని, వారిని చంపుతామని పోలీసుల ముందే హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హంతకులను సంఘటనా స్థలంనకు తీసుకురావాలని అంత వరకు మృత దేహాలను తరలించనీయమని బాధిత కుంటుంబీకులు, బంధువులు పోలీసులను అడ్డుకున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్ హెగ్డే, ఏటూరునాగారం సిఐ రఘుచందర్, మంగపేట ఎస్‌ఐ మహేందర్, మంగపేట ఏఎస్‌ఐ పిట్టా శ్యాంసుందర్‌లు మృతుల కుంటుంబీకులకు, బంధువులకు ఎంత నచ్చ చెప్పినా వినలేదు. దీంతో తప్పని సరి పరిస్థితులలో పోలీసులు స్వల్ప లాఠీ చార్జి చేసి అందరినీ అక్కడ నుండి వెళ్ళగొట్టారు. అనంతరం మృత దేహాలను పోలీస్ బందోబస్తు మధ్య ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు.
*నిందితులను కఠినంగా శిక్షిస్తాం : ఎఎస్పీ రాహుల్ హెగ్డే
జంట హత్యలకు కారకులైన వారందరినీ కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్ హెగ్డే బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. తమకు న్యాయం జరిగే వరకు తాము ఊరుకోమని, మృత దేహాలను తరలించనీయమని బాధిత కటుంబాలు మృత దేహాలు ఉన్న ఇంటి ముందు బైఠాయించారు. దీంతో ఏఎస్పీ రాహుల్ హెగ్డే బాధిత కటుంబ సభ్యులతో మాట్లాడుతూ నిందితులు పరారీలో ఉన్నారని, వారిని వెతికి పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని, బాధిత కటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
* నిందితుల ఇంటికి నిప్పు పెట్టిన బాధిత కుటుంబీకులు
తమ వారిని హత్య చేయడంతో ఆగ్రహంగా ఉన్న బాధిత కటుంబాలు కోపంతో రగిలిపోయాయి. దీంతో మృత దేహాలను తరలించిన అనంతరం బాధిత కుటంబీకులు నిందితుల ఇంటికి చేరుకుని వారి ఇళ్లను ధ్వంసం చేశారు. ఇంట్లోని వస్తువులను పగులగొట్టారు. భూక్యా రాజు ఇంట్లో కిరోసిన్ పోసి నిప్పంటించారు. సమాచారం అందుకున్న మంగపేట ఎస్‌ఐ మహేందర్ భూక్యా రాజు ఇంటికి చేరకుని తమ సిబ్బంది, స్థానికుల సహకారంతో మంటలను ఆర్పివేశారు. కాగా జంట హత్యల అనంతరం అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.

1న కల్లెడ వేంకటేశ్వరస్వామి
బహ్మోత్సవాలు
పర్వతగిరి, ఫిబ్రవరి 26: పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామంలో కొలను వేంకటేశ్వర స్వామి 8వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మార్చి 1నుండి 4 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులుశ్రీరంగాచార్యులు తెలిపారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ మార్చి 1న సాయంత్రం స్వస్తివాచనము, పుణ్యవాచనము 2వ తేదిన నిత్యహవనము,పారాయణాదులు, మంటపపూజ, కుంభస్థాపన, హోమం, ధ్వజారోహణము, 3వ తేదిన నిత్యహోమ పారాయణాదులు, బలిహరణం, కళ్యాణమహోత్సవం, 4వ తేదిన మహాపుర్ణాహుతి, శ్రీ పుష్పయాగము, దేవతోద్వాసనము, ద్వాదశ ప్రదక్షణలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున భక్తులందరు స్వామి వారిని దర్శించి కొలను వేంకటేశ్వరున్ని అనుగ్రహాం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు చైర్మన్ చినపాక యాకయ్య, ఆలయ ఆహ్వాన కమిటీ సభ్యులు సంపెల్లి వెంకటేశ్వర్లు, పరమేశ్, వడ్లకొండ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.