వరంగల్

కెసిఆర్‌తోనే గ్రామాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, ఏప్రిల్ 9: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోనే ఏజన్సీలోని మారుమూల గ్రామాలు అభవృద్ధి చెందుతాయని రాష్ట్ర గిరిజన, పర్యాటకశాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. ఆదివారం జయశంకర్ జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం, చిట్యాల, గంగగూడెం, గూర్రేవుల తదితర గ్రామాలలో పలు అభివృద్ది పనుల శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. తుపాకులగూడెంలోని బొజ్జారికుంట, గంగగూడెంలోని రాంపూర్ చెరువు పనులను ప్రారంభించారు. జాతీయ ఉపాధిహామీ నిధులతో బుట్టాయిగూడెం, చిట్యాల, రాజన్నపేట, గంగగూడెం, లక్ష్మీపురం, గూర్రేవుల గ్రామాలలో సిసి, బిటి రోడ్డు నిర్మాణాలకు శంకుస్ధాపన చేశారు. అనంతరం తుపాకులగూడెం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న బ్యారేజీ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు సంలలో బ్యారేజీ పనులు పూర్తిఅవుతాయని ఇంజనీరింగ్ అదికారులు తెలిపారు. గూర్రేవుల జడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో మారుమూల గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేదని, ఎడ్లబండ్లపై ప్రయాణాలు సాగించేవారని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రోడ్లు, విద్యుత్, విద్య, వైద్యం మంచినీటి సౌకర్యాలపై దృష్టి సారించి ప్రజల ఇబ్బందులను తొలగించేలా చర్యలు చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో లేని విధంగా ప్రజలకు సంక్షేమ పధకాలు అందిస్తున్నారని, అభివృద్దిని జీర్ణించుకోలేని ప్రతి పక్షాలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా రూ. 1.65కోట్లతో అభివృద్ది కార్యకక్రమాలు చేపట్టిందన్నారు. కొత్తూరు సర్వాయి పంచాయితీ పరిధిలోని చిట్యాల గ్రామం, కన్నాయిగూడెం గ్రామాలకు 200 డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికై ఎల్లవేళలా కృషిచేస్తానని, తెలంగాణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములయ్యారని, వారి సహకారం మరువలేనిదని అన్నారు. అనంతరం కళ్యాణలక్ష్మి లబ్దిదారులు పబ్బల లలిత, ఆకుతోట రమాదేవిలకు మంత్రి చేతులమీదుగా చెక్కులను అందజేశారు. టిఆర్‌ఎస్ నాయకులు పల్ల బుచ్చయ్య, మల్లారెడ్డి తదితరులు మంత్రి చందూలాల్, ములుగు మార్కెట్ కమిటి ఛైర్మన్ ప్రహ్లాద్‌లను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా పరిశీలకులు సాంబారి సమ్మారావు, ఐటిడిఎ పిఒ చక్రధర్‌రావు, జడ్పిటిసి వలియాబీ, ఎంపిపి మెహరున్నీసా, తహశీల్దార్ శ్రీనివాస్, స్ధానిక సిఐ రఘుచందర్, ఇంజనీరింగ్ అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

బహిరంగ మరుగుదొడ్ల నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యం
* ఆగ్రహం వ్యక్తం చేసిన నగరపాలక సంస్థ కమిషనర్

వరంగల్, ఏప్రిల్ 9: బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతంగా మార్చే కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరంలో మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేయటంలో అధికారులు నిర్లక్ష్యంపై నగరపాలక సంస్థ కమీషనర్ శృతిఓఝా ఆగ్రహం వ్యక్తం చేసారు. నగరాన్ని బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతంగా తయారుచేసే నిర్ణీతగడువు సమీపిస్తున్నా సంబంధిత అధికారులు పట్టనట్లుగా వ్యవహరించటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసారు. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతిపాదించిన షీ-టాయిలెట్లలో ఒక్కటి కూడా పూర్తిచేయకపోవటంపై ఆమె అధికారులను నిలదీసారు. ఆదివారం తన చాంబర్‌లో ఒడిఎఫ్ పనుల పురోగతిపై కార్పొరేషన్‌కు చెందిన వివిధ విభాగాల అధికారులతో కమీషనర్ శృతిఓఝా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు బహిరంగ మలవిసర్జనరహిత కార్పొరేషన్‌గా మార్చేందుకు ప్రతిపాదించిన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నగరంలో ఏక్కడెక్కడ మరిన్ని పబ్లిక్ మరుగుదొడ్లు అవసరమో గుర్తించి ఈనెల చివరిలోగా నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. షీ-టాయిలెట్లను కూడా నిర్ణీత గడువులో పూర్తిచేయాలని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క షీ-టాయిలెట్ నిర్మాణాన్ని కూడా పూర్తిచేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతి డిప్యూటీ ఇంజనీర్ పరిధిలో ఉన్న మరుగుదొడ్ల పురోగతిని ఆమె సమీక్షించారు. ఒకసారి మరుగుదొడ్లు నిర్మిస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని మరవకూడదని చెప్పారు. నగర పరిధిలోని 240మరుగుదొడ్లను సత్వరం నిర్మించుకుంటే డిఇ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని హెచ్చరించారు. నిర్ణీత సమయంలో కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేసేలా పర్యవేక్షణ జరపాలని కార్పొరేషన్ ఎస్‌ఇ భిక్షపతిని ఆదేశించారు. కమ్యూనిటీ మరుగుదొడ్లు, షీ-టాయిలెట్లు త్వరగా పూర్తయ్యేలా ఎఎస్‌సిఐ టీం లీడర్ రాజ్‌మోహన్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇఇ విద్యాసాగర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.