వరంగల్

కేసముద్రంలో ‘పనామా’ కలకలం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, ఏప్రిల్ 7: ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పనామా పత్రాల్లో ముగ్గురు తెలుగువారి పేర్లు బయట పడటం.. అందులో వరంగల్ జిల్లా కేసముద్రం (స్టే)కు చెందిన ఓలం భాస్కర్‌రావు పేరుండటంతో కేసముద్రంలో తీవ్ర కలకలం రేపింది. కేసముద్రంలో జన్మించిన భాస్కర్‌రావు చాలా ఏళ్ల క్రితం కేసముద్రం విడిచి పెట్టి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కేసముద్రం మండలంలో ఓలం వంశస్థులకు ప్రముఖ వ్యాపార కుటుంబంగా పేరుంది. ఓలం వంశస్తుల్లో అనేక మంది వ్యాపారంలో స్థిరపడగా కొందరు ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొందరు విదేశాల్లో.. ఇంకొందరు మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో స్థిరపడటం విశేషం. ఇదే కోవలో హైదరాబాద్‌లో స్థిరపడ్డ భాస్కర్‌రావు నగర శివార్లలో పలు చోట్ల వందల ఎకరాల్లో ఔషధ (జెట్రోఫా) మొక్కల ప్లాంట్లు ఏర్పాటు చేసి బాగా సంపాదించాడనే ప్రచారం సాగుతోంది. భాస్కర్‌రావు ఆయన తండ్రి సత్యనారాయణ మాత్రం మందుల షాపు నిర్వహిస్తూ కేసముద్రంలోనే ఉంటున్నారు. భాస్కర్‌రావు కుటుంబం పండుగలకు, వేడుకలు జరిగినప్పుడు మాత్రం కేసముద్రం వచ్చి వెళ్లడం జరుగుతోంది. అయితే ఉన్నట్టుండి గురువారం వివిధ పత్రికల్లో వెల్లడైన పనామా పత్రాల్లో తెలుగువారి పేర్లలో భాస్కర్‌రావు పేరు వెల్లడి కావడంతో ప్రతి ఒక్కరు భాస్కర్‌రావు గురించి చర్చించుకోవడం జరిగింది. కాగా, విదేశాల్లో కంపెనీలు, పెట్టుబడులు పెట్టలేదని, అదంతా ఒట్టి బూటకమని భాస్కర్‌రావు సమీప బంధువు ఒకరు కొట్టిపారేశారు. ఈ విషయంపై భాస్కర్‌రావును ఫోన్‌లో వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.