వరంగల్

కేంద్రప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 13: కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం జరపాలని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయరహదారుల శాఖ సహాయ మంత్రి పోన్ రాధాకృష్ణన్ బిజెపి కార్యకర్తలకు సూచించారు. 2019లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించటం, అధికారంలోకి రావటం ప్రధాన లక్ష్యంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. గురువారం నగరంలో జరిగిన బిజెపి వరంగల్ లోకసభ నియోజవర్గ స్థాయి బూత్‌స్థాయి ఇన్‌చార్జ్‌ల సమావేశానికి మంత్రి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీనాయకులను ఉద్ధేశించి మాట్లాడుతు పార్టీ నాయకులు వారివారి స్థాయిలో సమయాన్ని వెచ్చించి పార్టీకోసం సమిష్టిగా కృషి చేస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటం ఖాయమని అన్నారు. 2014లో కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 90కిపైగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులోకి తెచ్చారని, వీటివల్ల బడుగువర్గాలు, మహిళలకు పెద్దఎత్తున ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. ఈ కారణంగానే గడచిన మూడేళ్లలో జరిగిన వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో 13రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి రాగలిగిందని తెలిపారు. ఉత్తరాధిలో ఉన్నతస్థాయికి ఎదిగిన పార్టీ అగ్రనాయకత్వం టార్గెట్ దక్షిణాధిలో పాగా వేయటమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావటమే పార్టీ అసలు లక్ష్యమని చెప్పారు. తెలంగాణలోని 17ఎంపి స్థానాలు, 119 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలనే టార్గెట్‌తో అన్ని స్థాయిలలోని పార్టీక్యాడర్ పని చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో బిజెపి పాత్ర కీలకమని, తెలంగాణ కోసం రాష్ట్ర నాయకత్వం పోరాటాలు జరిపితే, కేంద్ర నాయకత్వం వారికి అండగా నిలచిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోని ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా బిజెపి పార్టీ క్యాడర్ పనిచేయాలని సూచించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతు కెసిఆర్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుందే తప్ప, ప్రజల ప్రయోజనాలను, సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టించేందుకు తాజాగా ముస్లిం రిజర్వేషన్ల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. ఒక్క రాష్ట్రప్రభుత్వమై ముస్లిం రిజర్వేషన్ల వ్యవహారంపై నిర్ణయం తీసుకునే అధికారం లేదని, కేంద్ర ప్రభుత్వానికి దీనిపై అధికారం ఉంటుందని అన్నా రు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ముస్లిం రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటామని స్పష్టం చేసారు. అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజేశ్వర్‌రావు, ధర్మారావు, జంగారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, శ్రీరాము లు, రూరల్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వాటర్ ట్యాంక్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
*పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
*రూరల్ జిల్లా కలెక్టర్ పాటిల్
ఆత్మకూరు, ఏప్రిల్ 13: మిషన్ భగీరథ పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్తరితగతిన పూర్తి చేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం దామెర, ఆత్మకూరు మండలాలలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా ఎప్పటికప్పుడు పర్యావేక్షించాలని ఆర్‌డబ్లుఎస్ అధికారులను ఆదేశించారు. రూరల్ జిల్లాలో వాటర్ ట్యాంకుల నిర్మాణం సంబంధిత పనులపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆత్మకూరులో 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించి పిహెచ్‌సిలో మరో ట్యాంక్ నిర్మాణం పనులను త్వరగా ప్రారంభించేల చర్యలు తీసుకోవాలని అన్నారు. త్వరితగతిన పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు వెంటవెంటనే బిల్లులు అందేలా చూడాలని ఆర్‌డబ్లుఎస్ ఈఈ కరుణాకర్‌ను ఆదేశించారు. పెద్దాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణ పనులలో తగిన ప్రమాణాలు పాటించని కాంట్రాక్టరుపైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సింగరాజుపల్లిలో జరిగే మిషన్ భగీరథ పనులను పర్యావేక్షించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో మహేందర్ జీ, ఆర్‌డబ్లుఎస్ ఈఈ కరుణాకర్, డిఈ దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్లు డిఎస్ వెంకన్న, సరిత, సర్పంచ్ నాగేళ్లి సామెల్, ఆర్‌ఐ వేణు, విఆర్‌వో సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి హరీష్ వరాల జల్లు
* రైతు బజారు, బస్టాండ్ అభివృద్ధి, అంబేద్కర్ భవనానికి హామీ
* రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి
చేర్యాల, ఏప్రిల్ 13: సిద్దిపేట జిల్లాలో కలిసిన తర్వాత మొట్టమొదటి సారిగా చేర్యాలకు వచ్చిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చేర్యాలకు వరాల జల్లు కురిపించారు. గురువారం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, పెద్దచెర్వు సుందరీకరణ, స్థానిక మార్కెట్‌యార్డులో రూ. 4కోట్లతో నిర్మించిన పనులకు శంఖుస్థాపన చేసి స్థానిక ఎంపిడివో కార్యాలయంలో నిర్మించిన స్ర్తిశక్తి భవనాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం స్థానిక కళ్యాణి గార్డెన్‌లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. ఎన్నో ఏళ్లు పాలన చేసిన కాంగ్రెస్ రైతులకు చేసిందేమి లేదని, ఇప్పుడు తాము చేస్తుంటే ప్రశంసించాల్సిందిపోయి విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తున్న ఘనత తమకే దక్కుతుందన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో వరి పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలను పెంచనున్నట్లు తెలిపారు. చేర్యాలలో 8 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. ఇప్పటి వరకు రైతులకు రావలసిన సొమ్మును రెండు, మూడు రోజుల్లో వచ్చే విధంగా చేస్తానని అన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించాడని, అందుకే సోమవారం రోజున 31జిల్లాల కలెక్టర్లతో రైతు సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మిర్చి రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంతో నీటి సమస్య తీరుతుందని, రెండు పంటలను పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. నిరంతర విద్యుత్ అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్న ఘనత సిఎం కేసిఆర్‌దేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల కోసం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను తెస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని కులాల వారి కుల వృత్తులకు బడ్జెట్‌లో పెద్దపీఠ వేయడం జరిగిందన్నారు. చేర్యాలలో రైతు బజారు ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిశీలించి వారం రోజులో నివేదిక ఇవ్వాలని, ఇందుకు రూ. 60లక్షలు మంజూరీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంపిపి మేడిశెట్టి శ్రీ్ధర్, జెడ్పిటిసి సుంకరి సరిత, వివిద గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.