వరంగల్

గూడ్స్ వాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగెం, ఏప్రిల్ 7: మినీ గూడ్స్ వాహనం, ప్రయాణికులతో వస్తున్న ఆటో ఢీ కొన్న సంఘటనలో మృతుల సంఖ్య 6గురికి చేరింది. మమూనూరు సిఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం బుధవారం సంగెం మండలం కాపుల కనిపర్తి-గుంటూరుపల్లి గ్రామాల మద్య గూడ్స్ వాహనం, ఆటో ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. పర్వతగిరి మండలం ఎనగల్లు నుండి మినీ గూడ్స్ వాహనం వరంగల్ వైపు వెళ్తుంది. వరంగల్ నుండి ప్రయాణికులతో ఆటో లోహితకు బయలు దేరింది. ఈ రెండు వాహనాలు కాపులకనిపర్తి-గుంటూరుపల్లి మద్య ఢీ కొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న లోహిత గ్రామానికి చెందిన సంగినేని వీరయ్య (50), వర్థనపేటకు చెందిన వల్లందాసు చింటు (14)లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆటో డ్రైవర్ ల్యాదెల్ల భాస్కర్ (28) హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మృతి చెందాడు. చెన్నరావుపేట మండలం జిజిఆర్‌పల్లికి చెందిన సుజాత (30), కూతురు పరమేశ్వరి (11) ఉస్మానియాలో చికిత్స పొందుతు మృతి చెందారు. సంగెం మండలం షాపురం గ్రామానికి ఎండి షామియా (35) హన్మకొండ మాక్స్ కేర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. హైదరబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన మృతదేహాలకు మమూనూరు ఎస్సై రాంప్రసాద్ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. వరంగల్‌లో మృతి చెందిన మృతదేహాలకు మమూనూరు ఎస్సై యుగేందర్ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. గాయాలైన మరి కొంత మంది పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.