వరంగల్

భూమాఫియాపై సర్కారు ఉదాసీనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 27: రాష్ట్రంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవటంలో, భూమాఫియాను కట్టడి చేయటంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. హైదరాబాద్ నగరంలో వందల వేల ఎకరాల భూములను అక్రమంగా ఆక్రమించుకుంటున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. నగరంలో ఇటీవల జరిగిన మియాపూర్ భూముల కుంభకోణ విషయంలో సిబిఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్, సిపిఐ, టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలతో కూడిన ప్రతినిధి బృదం బుధవారం ఢిల్లీ వెళ్లి కేంద్రహోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి కోరుతున్నట్లు చెప్పారు. వరంగల్ పర్యటన సందర్భంగా మంగళవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో చాడ మాట్లడుతు హైదరాబాద్ నగరం చుట్టు సుమారు 20వేల కోట్ల రూపాయల విలువచేసే భూములను భూమాఫియా అక్రమంగా, దర్జాగా రిజిస్ట్రేషన్ చేసుకుందని, ఈ విషయం బయటపడినా ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవటాన్ని గమనిస్తే ప్రభుత్వంలోని ముఖ్య నాయకుల పాత్ర ఉందని అనుమానించవలసి వస్తోందని అన్నారు. భూముల ఆక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, మాజీమంత్రులు, పార్టీ ముఖ్యుల పాత్ర ఉండటంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ వ్యవహారాన్ని పట్టించుకోవటం లేదని విమర్శించారు. మియాపూర్ భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించటం శోచనీయమని, మరి ప్రభుత్వానికి ఎటువంటి నష్టం, భూములు అన్యాక్రాంతం అవకుంటే సబ్ రిజిస్ట్రార్‌ను ఎందుకు సస్పెండ్ చేసారని ప్రశ్నించారు. ఇదే తరహాలో నయిం కేసులో కూడా ఆయనతో సంబంధాలు కలిగిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులను, నాయకులను, ఐపిఎస్ అధికారులను వదిలిపెట్టి కిందిస్థాయి అధికారులను, ఉద్యోగులను బలి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నయిం కేసులో బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా వివిధ సంఘటనల్లో విద్యార్థులు, యువకులపై అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసులను ఇప్పటి వరకు ఎత్తివేయకపోవటంతో విద్యార్థులు, యువకులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను తక్షణం ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అదే విధంగా కేంద్రప్రభుత్వ పరిధిలో ఉన్న కేసుల ఎత్తివేతకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని చెప్పారు. ప్రజాఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు ఉద్యమాలను అణచివేయాలనే ఆలోచనతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రద్దీ స్థలాల్లో యజ్ఞయాగాదులకు అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం ధర్నా చౌక్ వద్ద వివిధ సమస్యలపై ఆందోళనలు జరపకుండా అడ్డుకుంటోందని, ధర్నా చౌక్‌ను ఎత్తివేయటానికి నిర్ణయించిందని అన్నారు. ధర్నా చౌక్ కొనసాగింపును కోరుతు జూలై ఒకటిన ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నామని, తొమ్మిదిన హైదరాబాద్‌లో మేధావులతో సమావేశం నిర్వహిస్తున్నామని చాడ చెప్పారు. ధర్నాచౌక్ విషయంలో ముఖ్యమంత్రి నుంచి సానుకూలత వ్యక్తం అవకుంటే జూలై 25న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. విలేఖరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కరుణాకర్, సహాయ కార్యదర్శి బిక్షపతి, నగర కార్యదర్శి బాషుమియా తదితరులు పాల్గొన్నారు.