వరంగల్

రేషన్ పరేషాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, డిసెంబర్ 10: ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన బయోమెట్రిక్ విధానం అటు ప్రజలకు, ఇటు రేషన్ డీలర్లకు ఇబ్బందిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల వ్యాప్తంగా 19 గ్రామాల్లో 44 మంది రేషన్ డీలర్లు ఉండగా, 21596 రేషన్‌కార్డులున్నాయి. ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికీ రూపాయికి కిలో చొప్పున ఆరు కిలోల బియ్యం కేటాయిస్తున్నారు. ఈ విధంగా కేటాయించిన బియ్యంలో అధికం డీలర్లు దొడ్డిదారిలో నల్లబజారుకు తరలిస్తున్నారనే విమర్శల నేపధ్యంలో ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో పౌరసరఫరాల సంస్ధలో సమూల మార్పులు తెచ్చింది. గతంలో రేషన్ కోటా విడుదల, సరఫరా, పంపిణీ తదితర పనులను స్థానిక తహశీల్ధార్ కార్యాలయం నుంచి జరుగుతుండగా తాజాగా అంతా ఆన్‌లైన్ చేసి కనీసం డీలర్ల వద్ద ముగింపు కోటా కూడా తెలుసుకునే పరిస్థితి లేకుండా చేశారు. రేషన్ కోటా డీలర్ పాయింట్‌కు చేరగానే సదరు కార్డుదారు ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు వెళ్లి రేషన్‌షాపులో బయోమెట్రిక్ యంత్రంలో వేలి ముద్ర వేస్తే చాలు సరుకులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రతి రేషన్‌షాపుకు బయోమెట్రిక్ యంత్రంతో పాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని ఏర్పాటు చేసి బ్లూటూత్ మిషన్‌కు అనుసంధానించడంతో తూకం మీద ఆ కుటుంబానికి సరిపడా బియ్యం కాంటా వేయగానే ఆ కార్డుదారుడికి బియ్యం ఇచ్చినట్టు ట్రాన్సాక్షన్ సక్సెస్ మెస్సేజ్ వస్తుంది. దీంతో వెంటనే ఈ సమాచారం ఆన్‌లైన్ ద్వారా క్షణంలో రాష్ట్ర పౌరసఫరాల సంస్థకు చేరిపోతోంది. ఈ తతంగం జరగడానికి కార్డుదారు కుటుంబ సభ్యుల్లో ఒకరు కచ్చితంగా వేలి ముద్ర వేయాల్సి వస్తుండటం, ఆ సమయంలో బయోమెట్రిక్ యంత్రం సెల్‌ఫోన్ సిగ్నల్ సరిగా లేక తరచుగా లైన్ కట్ అవుతోందంటున్నారు. రోజులో కనీసం పది మందికి పైగా వేలిముద్రలు సరిపోవడం లేదని, దీంతో ఇలాంటి పరిస్థితి తలెత్తితే సదరు వ్యక్తికి చెందిన పది వేలి ముద్రలను సరిచూడటానికి సమయం తీసుకుంటుండటంతో లైన్‌లో ఉన్న ఇతరులు నిరసనకు దిగుతున్నారంటున్నారు. ఇక పలుమార్లు సిగ్నల్ లేకపోవడంతో తరచుగా యంత్రం మొరాయిస్తోందంటున్నారు. ఫలితంగా రేషన్‌షాపుల వద్ద ప్రజలు పడిగాపులు పడాల్సి వస్తోందంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అధికులు వ్యవసాయ పనులకు వెళుతుండటంతో ఉదయం పూట, సాయంత్రం మాత్రమే రేషన్ తీసుకోవడానికి వస్తుండటం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. అనేకమంది వేలి ముద్రలు సరిపోక బియ్యం తీసుకోలేక పోతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆసరా పింఛన్‌లో వేలి ముద్రలు సరిపోని వారికి గ్రామ పంచాయతీ కార్యదర్శి వేలిముద్రలతో పింఛన్ ఇస్తున్నట్టుగానే వేలి ముద్రలు సరిపోని వ్యక్తులకు కూడా గ్రామాల్లో రేషన్ బియ్యం గ్రామ రెవెన్యూ అధికారి వేలిముద్రతో బియ్యం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం వందలో ఒక్కరికి మాత్రమే.. అది కూడా డీలర్ చెప్పిన వారికే ఇస్తున్నారని, ఈ విధానాన్ని పునఃసమీక్షించి వేలి ముద్రలు సరిపోని వారందరికీ బియ్యం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా గ్రామాల్లో పర్యటించి ఆయా గ్రామాల్లో సిగ్నల్ ఎక్కువగా ఉండే కంపెనీ సిమ్ ఇస్తే సిగ్నల్ అంతరాయం లేకుండా రేషన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అనుకూలంగా ఉంటుందంటున్నారు.

బయ్యారం మాకొద్దు

* ఎమ్మెల్యే కోరం కనకయ్యను అడ్డుకున్న ఆదివాసీలు

మహబూబాబాద్,డిసెంబర్ 10: మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఉక్క్ఫ్యుక్టరీ నిర్మాణం చేయవద్దని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వాహనాన్ని ఆదివాసీలు అడ్డుకున్నారు. తాజాగా కేంద్రప్రభుత్వం పాల్వంచలో ఉక్క్ఫ్యుక్టరీ నిర్మాణానికి మొగ్గుచూపడంతో బయ్యారం ఉక్క్ఫ్యుక్టరీ ఏర్పాటుపై ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారంలోని ఉక్కు ఫ్యాక్టరీ ప్రతిపాదిత గుట్టనులను పరిశీలించేందుకు ఇక్కడికి రాగా ఆదివాసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు.
ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించినట్లైతే అటవీ ప్రాంతం అంతా కొల్లగిట్టినట్లు అవుతుందని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విభజన చట్టం అమల్లో భాగంగా బయ్యారంలో తక్షణమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగానే తాజాగా బయ్యారంలో ఉక్క్ఫ్యుక్టరీకి బదులు ఖమ్మం జిల్లా పాల్వంచలో ఉక్క్ఫ్యుక్టరీ నిర్మాణానికి కేంద్రం మొగ్గుచూపడంతో వివాదం నెలకొంది.

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వడ్డేపల్లి, డిసెంబర్ 10: రాష్ట్రంలో విద్యారంగంలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.ఉపేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం డిఎస్‌ఒ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం హన్మకొండలోని ప్రశాంత్‌నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 34 విభాగాలు ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయంలో కేవలం ఒకే ఒక కామన్ మెస్‌ను నిర్వహించడం సిగ్గుచేటని, అవసరమైన మేరకు మెస్‌లను పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి, ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క వౌలిక సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. పేద విద్యార్థుల పక్షాన నిలబడిన అధ్యాపకులను అణచివేస్తూ నిర్బంధిస్తున్నారని, 90 శాతం అంగవైకల్యం గల ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆచార్యులు సాయిబాబాను నిర్బంధించడం కేంద్ర ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలని, విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సాయిబాబాకు సరియైన వైద్యం సౌకర్యం కల్పించి బెయిల్‌పై విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నెల 17న ఆదివాసీల హక్కుల సాధనకు ఆదిలాబాద్‌లో జరిగే గిరిజన సదస్సుకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రవళిక, అశోక్, జిల్లా విద్యార్థి నాయకులు పృద్వీ, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికే ప్రభుత్వం పెద్దపీట

జఫర్‌గడ్, డిసెంబర్ 10: గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మాజీ డిప్యూటి సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం మండలంలోని తీగారం గ్రామంలో స్మశానవాటికకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక నిధులు వెచ్చించి అభివృద్ధి పరుస్తోందని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
అంతే కాకుండా నియోజక వర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న తనపై ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగతంగా విమర్శించడం తగదన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉండి అధికార పార్టీకి సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్పా విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
అనంతరం తీగారం గ్రామంలో స్మశానవాటికకు రూ. 9లక్షల78వేలు, మెటల్ రోడ్డు నిర్మాణానకి రూ. 4లక్షల 95వేలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప, సర్పంచ్ సుజాత, రైతు మండల సమన్వయ కమిటి కో- ఆర్డినేటర్ శంకర్, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కనకయ్య, నాయకులు ఎల్లయ్య, రాజు, రవీందర్, యాకయ్య, బుచ్చయ్య, ఏపీవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

సైడు కాలువ నిర్మాణ పనులు ప్రారంభం
కేసముద్రం, డిసెంబర్ 10: కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామ యాదవ బజార్‌లో 17వ ఆర్ధిక సంఘం నిధులు 2 లక్షల వ్యయంతో చేపట్టే సైడు కాలువ పనులకు గ్రామ సర్పంచ్ గండు విజయ్‌కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా గ్రామంలో అనేక అభివృద్ది పనులు చేపట్టామన్నారు.
పనులను నాణ్యతతో చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ గుజ్జునూరి వెంకన్న, దర్గయ్య, యాకన్న, చేరాలు, కమలమ్మ పాల్గొన్నారు.

మున్సిపాలిటీ నూతన కార్యాలయాన్ని
ప్రజామోద స్థలంలో నిర్మించాలి

మహబూబాబాద్,డిసెంబర్ 10: మహబూబాబాద్ మున్సిపాలిటీ నూతన కార్యాలయాన్ని అధికారిక సమావేశం ఏర్పాటు చేసి ప్రజా ఆమోద స్థలంలో నిర్మించాలని సీపీఐ రాష్టక్రౌన్సిల్ సభ్యుడు, మున్సిపల్ ఫ్లొర్‌లీడర్ బి.అజయ్ అన్నారు. ఆదివారం స్థానిక నెహ్రుసెంటర్‌లో సీపీఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్ అధ్యక్షతన జరిగిన సీపీఐ చర్చావేదికలో అజయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీ స్థలం, మసీదు పక్కన గల స్థలం మొత్తం కలుపుకొని సుమారు 1500 నుండి 2వేల గజాల స్థలం బహుళ అంతస్థుల భవనంను ఆధునిక హంగులతో నిర్మించవచ్చని అన్నారు. లేనియెడల ప్రత్యామ్నాయంగా ఇందిరా సెంటర్‌లోని 2వేల గజాల్లో లేదా ఇరిగేషన్ ఓసిక్లబ్ స్థలాలను పరిశీలించి పరస్పర శాఖల మధ్య స్థలాలు బదిలీ ద్వారా నిర్ణయ అవకాశాలను పరిశీలించవచ్చన్నారు. అదేవిధంగా పట్టణం చుట్టూ ఔటర్‌రింగ్‌రోడ్డును నిర్మించాలన్నారు. ఫాతిమా స్కూల్ నుండి ఏరియా ఆసుపత్రి వరకు ప్రస్తుత రోడ్డు తీవ్ర రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా హౌసింగ్ కార్యాలయం, పత్తిపాక, పులిగోపాల్‌రోడ్డు నడక మీదుగా శ్రీరంగం బుచ్చయ్య పెట్రోల్‌బంక్ కురవి రోడ్డ వరకు కొత్త ప్రత్యామ్నయ రోడ్డు నిర్మించాలని, నలంద కళాశాల పక్కన నుండి పోలీస్ క్వార్టర్స్ వరకు ఉన్న బతుకమ్మ రోడ్డును ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనుండి వేల్పుల సత్యం కాలనీ మీదుగా నర్సంపేట రోడ్డుకు ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మించాలని అన్నారు. టీఆర్‌ఎస్ ఫ్లొర్‌లీడర్, పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ, కలెక్టరేట్, ఎస్సీ కార్యాలయ భవనాలు నిర్మించాల్సి ఉందని అదేవిధంగా మున్సిపాలిటీ భవనానికి రూ.5.50కోట్లు మంజూరైనందున ప్రస్తుత స్థలంతోపాటు ప్రత్యామ్నాయంగా ఐబి, ఇందిరా సెంటర్, ఒసి క్లబ్‌లను పరిశీలిస్తామన్నారు.
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా అంశాలపై సీపీఐ చర్చావేదిక ఒక మంచి చర్చను ముందుకు తీసుకువచ్చిందని అయితే దీనిపై ఇక్కడికిక్కడే నిర్ణయం సాధ్యం కాదని ప్రభుత్వం, మున్సిపాలిటీ సంబంధిత అధికారులు, పార్టీలతో అఖిలపక్ష సమావేశం మరొకటి అధికారికంగా నిర్వహించాలన్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భూపతి మల్లయ్య మాట్లాడుతూ.. ఓసి క్లబ్ నూతన భవనం బాగుందన్నారు. జేఏసీ కో ఆర్డినేటర్ పిల్లి సుధాకర్, నాయకులు గుజ్జు దేవేందర్, శంతన్‌రామరాజు, బొడ్డుపెల్లి ఉపేందర్, దైద వెంకన్న, నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రస్తుత మున్సిపాలిటీ స్థలమే ప్రజలందరికీ అందుబాటులో ఉందని ఇక్కడ నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుందన్నారు.
ఈ చర్చావేదికలో రేషపల్లి నవీన్, దాస్యం రాంమూర్తి, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, నర్ర శ్రావణ్, కందుకూరి రమణ, వెలుగు శ్రావణ్, కృష్ణయ్య, యాకమ్మ, జన్ని భద్రం, చేపూరి గణేష్, శ్యాం, యాకుబ్, హరీష్, పంజాల శ్రీనివాస్, వెంకట్, భూక్య ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

చోరీకి మహిళల యత్నం
పరకాల, డిసెంబర్ 10: పరకాల బస్టాండ్‌లో ఆదివారం ఇద్దరు మహిళలు దొంగతానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు సంబంధించి పరకాల పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం పరకాల బస్టాండ్‌లో వరంగల్ శివనగర్‌కు చెందిన మహిళలు విజయ, ఉషారాణిలు దొంగతానికి ప్రయత్నించగా అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించిన పరకాల ఎస్సై రవీంద్ర కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
జీరో పత్తి దందాను అరికట్టాలి
నర్సంపేట, డిసెంబర్ 10: నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో జీరో పత్తి దందా యధేచ్ఛగా నడుస్తున్నా మార్కెట్ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడం శోచనీయమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నర్సంపేట డివిజన్ కార్యదర్శి లావుడ్యా రాజు అన్నారు. నర్సంపేట మార్కెట్ నుండి అక్రమంగా టాటా ఏస్‌లో తరలుతున్న 25 క్వింటాళ్ల జీరో పత్తిని ఆదివారం న్యూడెమోక్రసీ కార్యకర్తలు పట్టుకుని మార్కెట్ సిబ్బందికి అప్పగించారు. ఈసందర్భంగా లావుడ్యా రాజు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్‌లో లైసెన్స్ లేని వ్యాపారి మంజునాథరాజు 60 బస్తాల పత్తిని కొనుగోలు చేసి సెస్ చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్నాడని చెప్పారు. అధికారుల అండతో మార్కెట్‌లో జోరుగా జీరో దందా నడుస్తోందని అన్నారు. లైసెన్స్ లేని వ్యక్తులు మార్కెట్‌లో కొనుగోళ్లు చేస్తున్నారంటే మార్కెట్ సిబ్బంది పనితీరు ఎంత దయనీయంగా ఉందో గమనించాలన్నారు. జీరో పత్తి దందా చేస్తున్న వ్యాపారులపై మార్కెట్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మాడ అశోక్, బూర్గు వీరన్న, మల్లన్న, ప్రదీప్, ఓదేలు తదితరులు పాల్గొన్నారు.