వరంగల్

మానవత్వం చాటుకున్న కలెక్టర్ ప్రీతిమీనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి,డిసెంబర్ 16: కురవి మండలం మొగుళ్లపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి గాయాలపాలైన ఒక వ్యక్తిని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ తన స్వంత వాహనంలో ఆసుపత్రికి తరలించి మనవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శనివారం డోర్నకల్‌లో క్రైస్తవులకు దుస్తుల పంపణీ కార్యక్రమానికి కలెక్టర్ ప్రీతిమీనా హాజరై తిరిగి వస్తుండగా కురవి మండలం మొగుళ్లపల్లి ప్రధాన రహదారిపై ఈగ మల్లయ్య(60)వ్యక్తి తన ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటనను గమనించిన కలెక్టర్ వెంటనే తన వాహనాన్ని ఆపి గాయాలపాలైన వ్యక్తిని మానవతా దృక్పథంతో తన వాహనంలో ఎక్కించుకొని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందించాల్సిందిగా డాక్టర్‌లను ఆదేశించారు.

వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ బదిలీ
నక్కలగుట్ట, డిసెంబర్ 16:వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కుమ్రం భీమ్ ఆసీఫాబాద్ జిల్లాకు శనివారం బదిలీ అయినట్లు ఉత్తర్వులు అందాయని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న అమ్రపాలికి వరంగల్ రూరల్ జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు.
వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రభుత్వ పథాకాల అమలులో సమర్ధవంతంగా పనిచేసినట్లు పలువురు తెలిపారు.